'పైలెట్ చివరి సందేశం ఇదే'... ఎస్.కే. సిన్హా కీలక ప్రకటన!

అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై తాజాగా విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది.;

Update: 2025-06-14 13:45 GMT

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రకరకాల ప్రచారాలు, సందేహాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సందర్భంగా విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్.కే. సిన్హా కీలక ప్రకటనలు చేశారు.

అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై తాజాగా విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇందులో భాగంగా ఆ శాఖ కార్యదర్శి సిన్హా స్పందిస్తూ.. ఏఐ-171 పైలట్లు శనివారం మధ్యాహ్నం 1:39 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కు చివరి రేడియో సందేశాన్ని పంపారని తెలిపారు.

విమానం 650 అడుగుల ఎత్తు తర్వాత పైకి ఎగరకపోవడంతో పైలట్లు ప్రమాద హెచ్చరిక చేశారని తెలిపారు. విమానంలో ఉన్న 242 మందిలో ఒకరు తప్ప అంతా మరణించే ముందు కెప్టెన్ సుమిత్ సభర్వాల్ చివరి మాటలు.. "మేడే.. మేడే.." అని సిన్హా వివరించారు. అనంతరం విమాన సిబ్బందిని ఏటీసీ సంప్రదించినా స్పందన రాలేదని తెలిపారు.

అనంతరం క్షణాల్లోనే విమానం పెద్ద శబ్ధంతో పేలి మంటలు అగ్ని గోళాన్ని తలపించాయని తెలిపారు. ఇలా విమానం కూలిన 20 నిమిషాల తర్వాత.. అంటే, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందిందని.. అహ్మదాబాద్ ఏటీసీ నుంచి దీని గురించి తమకు వెంటనే వివరణాత్మక సమాచారం అందిందని అన్నారు.

ఈ నేపథ్యంలో విమానం బ్లాక్ బాక్స్ దొరికిందని.. ప్రస్తుతం దానిపై దర్యాప్తు జరుగుతోందని.. ఈ క్రమంలో 100 మందికిపైగా కార్మికులు, 40 మంది ఇంజినీర్లు విమానం కూలిన ప్రదేశంలో శిథిలాలను తొలగించే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లు ఉన్నారని తెలిపారు.

Tags:    

Similar News