• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కుమార్తె ప్రైవేటు...

కుమార్తె ప్రైవేటు వీడియోలు బయటకు... వీడు తండ్రేనా..?

| ఈ క్రమంలో తాజాగా కూతురు జీవితాన్ని నాశనం చేసిన తండ్రి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-07-14 03:30 GMT

ఇటీవల కాలంలో ఆడపిల్లల పాలిట కుటుంబ సభ్యులు, కన్నవారు, బంధువులే కాలయములుగా మారుతున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. కంచే చేనే మేసినట్లుగా.. కాపాడాల్సిన వారే వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. పైగా పరువు హత్యలు పేరున జరుగుతున్న దారుణాలు మరికొన్ని. ఈ క్రమంలో తాజాగా కూతురు జీవితాన్ని నాశనం చేసిన తండ్రి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... తాను చెప్పిన మాట వినడం లేదని ఓ తండ్రి రాక్షసుడిగా మారిపోయాడు! ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన అతడు.. ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయే పరిస్థితి కల్పించాడు. దీంతో... తన కుమర్తె జీవితాన్ని నాశనం చేస్తున్నాడంటూ తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నాటకలో జరిగింది!

వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె (18) సమీప బంధువైన ఓ కుర్రాడిని ఇష్టపడింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి తెలిసిందే. వీరి ప్రేమకు అతడు అంగీకారం తెలపలేదు. తనకు ఇష్టం లేదని చెబుతూ రోజూ కుమార్తెను వేధింపులకు గురిచేసేవాడు. ఈ సమయంలో అడ్డొచ్చిన తల్లినీ చితక బాదేవాడు.

ఇదే క్రమంలో ఒక రోజు తన కుమర్తె ప్రేమించిన యువకుడిని ఇంటికి పిలిపించి మరీ చేయిచేసుకున్నాడు. ఆ సమయంలోనే అతడి మొబైల్ ఫోన్ లో ఉన్న యువతి వ్యక్తిగత వీడియోలను బలవంతంగా తీసుకున్నాడు. అలా అని వాటిని డిలీట్ చేయలేదు సరికదా... ఏకంగా ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసేశాడు.

దీంతో ఆ అమ్మాయి వీడియోలు ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారాయి! దీంతో ఆ అవమానం తాళలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సకాలంలో స్పందించిన బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ నేపథ్యంలోనే ఇక అతడి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి తల్లి. దీంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    
  • Karnataka 
  • Udupi 
  • Love 
  • LoveMarriage 
  • MobilePhones 
  • SocialMedia 
  • Sucicde 
  • Hospital 
  • PoliceCase 
  • Investigation 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS