• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలుగు ‘టాప్ హీరో’...

తెలుగు ‘టాప్ హీరో’ గదిలోకి రమ్మన్నాడు... నటి సంచలన ఆరోపణలు!

| ఈ నేపథ్యంలో తాజాగా నటి విచిత్ర ఒక తెలుగు టాప్ హీరో పై సంచలన ఆరోపణలు చేశారు.

By - Tupaki Desk
Update: 2023-11-22 10:54 GMT

క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఇది కోవిడ్ ని మించిన వైరస్ అని ఈ బారినపడిన వారు ఆరోపిస్తుంటారు. మరికొంతమంది తమదైన శైలిలో నిరసనలు తెలిపారు. కొన్నేళ్ల క్రితం కస్తూరి, రాధికా ఆప్టే తదితరులు పలువురు నటుల మీద ఇలాంటి ఆరోపణలు చేశారు. అయితే వీటిపై పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా నటి విచిత్ర ఒక తెలుగు టాప్ హీరో పై సంచలన ఆరోపణలు చేశారు.

అవును... సుమారు 21 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉండటానికి గల కారణాలను నటి విచిత్ర తాజాగా బయటపెట్టారు. బిగ్‌ బాస్‌ షోలో షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. 2000వ సంవత్సరంలో ఓ దివంగత నటుడు తనకు ఓ సినిమా ఆఫర్‌ ఇచ్చారని.. ఆ మూవీ షూటింగ్‌ కేరళలోని మలంపుళలో జరిగిందని.. అక్కడే తన భర్త పరిచయమయ్యాడని మొదలుపెట్టిన విచిత్ర... అక్కడే తన జీవితంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు.

ఒక తెలుగు హీరోను, తనను 3 స్టార్‌ హోటల్‌ లో ఉండమన్నారని.. అక్కడ ఓ రోజు పార్టీ జరుగుతోందని.. అక్కడే ఆ ఫేమస్‌ హీరోను కలిశానని ఆమె తెలిపారు. అలా కలిసి అనంతరం అతడు కనీసం తన పేరు కూడా అడగలేదు కానీ... డైరెక్ట్‌ గా తన రూం కి వచ్చేయమన్నాడని విచిత్ర తెలిపారు. దీనికి తాను షకైనట్లు వెల్లడించారు. అనంతరం అతడి మాటను పట్టించుకోకుండా వెళ్లి తన గదిలో పడుకున్నట్లు తెలిపారు. ఇక ఆ తర్వాతి రోజు నుంచి షూటింగ్‌ లో సమస్యలు చుట్టుముట్టాయని ఆమె వివరించారు.

అలా పార్టీ జరిగిన రోజు రాత్రి తన రూం కి వెళ్లలేదని ఆ హీరో ఆ హీరో తాగి వచ్చి తన గది తలుపు తట్టేవాడని.. ఆ గండం నుంచి ఎలా బయటపడాలా అని భయపడిపోయినట్లు ఆమె తెలిపింది. ఈ సమయంలో తన బాదను అర్ధం చేసుకున్న ఆ హోటల్ మేనేజర్... చిత్ర యూనిట్‌ కు తెలియకుండా రోజుకో గదికి షిఫ్ట్‌ చేశాడని.. ఆ హీరో మాత్రం తాను పాత రూంలోనే ఉన్నాననుకుని తాగి డోర్‌ తట్టేవాడని వివరించారు.

ఈ క్రమంలో ఒకరోజు అడవిలో షూటింగ్‌ జరుగుతుండగా ఎవరో తనను అసభ్యంగా తాకారని.. ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు చేశారని ఆమె తెలిపింది. దీంతో అతడి చేయి పట్టుకుని లాగి స్టంట్‌ మాస్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే.. అతడు రివర్స్‌ లో తన చెంపే చెళ్లుమనిపించాడని ఆమె తెలిపారు. అనంతరం చెంప మీద దెబ్బ తాలూకు గుర్తుతో యూనియన్‌ దగ్గరకు వెళ్తే ఈ సంఘటనను మర్చిపోమన్నారని ఆమె గుర్తుచేసుకున్నారు!

ఆ సమయంలో తనకు ఎంతో సహకారిగా, తోడుగా ఆ హోటల్ మేనేజర్ ఉన్నారని... కోర్టులో సాక్షిగా కూడా నిలబడ్డారని.. అతనే తనను పెళ్లి చేసుకుని ముగ్గురు అందమైన పిల్లలను ఇచ్చారని విచిత్రం తెలిపారు. ఈ క్రమంలో చాలా మంది తనను పెళ్లి చేసుకున్నాకే సినిమాలకు గుడ్‌ బై చెప్పినట్లు అనుకుంటారు కానీ... అసలు కారణం ఇదే అని ఆమె తెలిపారు! ఈ సందర్భంగా... తమిళ ఇండస్ట్రీలో తనకు ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదురవ్వలేదని ఆమె చెప్పడం గమనార్హం!

దీంతో ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆన్ లైన్ వేదికగా సెర్చింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు. ఇందులో భాగంగా ఆమె నటించిన తెలుగు సినిమాల్లో 2001 లో విడుదలైన వాటి లిస్ట్ తీస్తున్నారు. దీంతో సదరు టాప్ హీరో పేరు ఆమె చెప్పనప్పటికీ.. అందించిన వివరాలతో అతనెవరనేది కనుక్కోవడం పెద్ద సమస్య కాదనేది నెటిజన్ల కామెంట్!

మరోపక్క ఇప్పటికే ఆ హీరో ఎవరనేది సెర్చ్ చేసి ఒక కన్ క్లూజన్ కి వచ్చేసిన నెటిజన్లు... ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. మహిళల గురించి సినిమాలో చెప్పే డైలాగులకు, బయట చేసే పనులకూ పొంతనలేదా అని ప్రశ్నిస్తున్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు గూరేవి జి.కొంపలు అంటే ఇదే అని ఎద్దేవా చేస్తున్నారు.

వాస్తవానికి సదరు హీరో గతంలో బహిరంగ వేధికలపై మహిళల గురించి లోకువ చేసి వ్యాఖ్యలు చేశారు! ఇదే సమయంలో రాజకీయ నేపథ్యం కూడా కలిగి ఉన్న వ్యక్తి కావడంతో నెటిజన్ల కామెంట్లు మరింత డీప్ గా మారుతున్నాయి. ఫలితంగా... సదరు స్టార్ హీరో గౌరవం పూర్తిగా పడిపోయిందనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా బలంగా వినిపిస్తున్నాయి! ఇప్పటికే నెట్టింట తీవ్ర చర్చనీయాంశం అయిన ఈ వ్యవహారం.. ముందు ముందు ఎలాంటి పెను సంచలనాలను సృష్టించబోతుంది అనేది ఆసక్తిగా మారింది!

#BiggBossTamil7 SHOCKING - #Vichitra shares her bad experiences while shooting for a Telugu film 🙄😮#BiggBoss7Tamil #BiggBossTamilSeason7pic.twitter.com/AUnwTIxv6r

— VCD (@VCDtweets) November 21, 2023
Tags:    
  • Telugutophero 
  • Actress 
  • Vichitra 
  • Allegations 
  • Kerala 
  • Movieshooting 
  • Teluguhero 
  • TamilBiggBoss 

Similar News

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS