పుట్టింది పాక్ లో.. 19 ఏళ్లుగా ధర్మవరంలోనే.. ఇప్పుడేంటి పరిస్థితి?

పాక్ లో పుట్టిన ఒక మహిళ భారత్ కు వచ్చి భారతీయుడ్ని పెళ్లాడింది. అయితే.. అనుకోని రీతిలో ఆమె తన కుమార్తెకు జననాన్ని పాకిస్తాన్ లో ఇచ్చింది.;

Update: 2025-04-28 04:46 GMT

అనుకుంటాం కానీ కొన్ని పరిణామాలు కొందరి జీవితాల్లో ఊహించని సమస్యల్ని తీసుకొస్తాయి. అలాంటి సమస్యే 26 ఏళ్ల యువతికి వచ్చింది. ఆమె పుట్టింది పాకిస్తాన్ లోనే అయినా.. పెరిగింది భారత్ లోనే. గడిచిన 19 ఏళ్లుగా ఉమ్మడి అనంతపురం ధర్మవరంలోనే పెరిగింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కు తిరిగి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడని ఆమె భవిష్యత్తు ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

పాక్ లో పుట్టిన ఒక మహిళ భారత్ కు వచ్చి భారతీయుడ్ని పెళ్లాడింది. అయితే.. అనుకోని రీతిలో ఆమె తన కుమార్తెకు జననాన్ని పాకిస్తాన్ లో ఇచ్చింది. ఏడేళ్ల వయసులో భారత్ కు వచ్చేశారు. ప్రస్తుతం ఆ అమ్మాయికి 26 ఏళ్లు. ఏడేళ్ల వయసులో ఇండియాకు వచ్చేసినప్పటికీ.. ఇప్పటికి పాక్ పౌరురాలిగానే రికార్డుల్లో ఉంది. ఇంతకాలం భారత పౌరసత్వం గురించి ఆలోచించని ఆమె.. రెండేళ్ల క్రితం భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే.. ఆమె దరఖాస్తుకు అధికారుల ఆమోదముద్ర పడలేదు. తాజా పరిణామాల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆమె ఉంది.

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రంశా రఫిక్.. ఇప్పుడు పాక్ కు వెళ్లేందుకు ఇష్టం లేదు. అలా అని.. ఆమె వెళ్లకుండా ఉండేందుకు వీల్లేని పరిస్థితి. బళ్లారికి చెందిన మహబూబ్ పీరన్ అనే వ్యక్తి దేశ విభజన వేళలో పాక్ కు వెళ్లిపోయారు. అక్కడే ఆయనకు ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. చిన్న కుమార్తె జీనత్ పీరన్ ధర్మవరంలోని తన చెల్లెలు కొడుకు రఫిక్ అహ్మద్ కు ఇచ్చి 1989లో పెళ్లి చేశారు. ఈ జంటకు మొదట కొడుకు పుట్టగా.. 1998లో రెండోసారి జీనత్ గర్భం దాల్చింది.

ఆ సమయంలో ఆమె తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవటంతో తండ్రిని చూసేందుకు పాక్ కు వెళ్లింది. అదే సమయంలో కార్గిల్ యుద్దం మొదలైంది. దీంతో తిరిగి వచ్చేందుకు వీలు కాలేదు. పాక్ కు వెళ్లే వేళకు గర్భవతిగా ఉన్న జీనత్ కు పాక్ లోనే ప్రసవమైంది. ఆమెకు రంశా రఫిక్ పుట్టారు. 2005లో ఆమెను తీసుకొని ధర్మవరం వచ్చేశారు జీనత్ పీరన్. పాక్ లో పుటటిన రంశా రఫిక్ కు పాక్ పౌరసత్వం వచ్చింది. తర్వాత ధర్మవరం వచ్చినప్పటికీ భారత పౌరసత్వం కోసం ప్రయత్నం చేయలేదు. 2018లో పాక్ పౌరసత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. అది 2028 వరకు మనుగడలో ఉంది. అయితే.. రెండేళ్ల క్రితం భారత పౌరసత్వం కోసం అప్లై చేసుకుంటే రిజెక్టు చేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

Tags:    

Similar News