• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Food >  సామాన్యుడికి బిగ్ రిలీఫ్:...

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

| బియ్యం ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై 294 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి 516 కేసులు నమోదు చేసింది. రూ.10.43 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకుంది. బియ్యం రకాల వారీగా గరిష్ఠ విక్రయ ధరలను నిర్ణయించి, వాటిని మించి అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

By - Tupaki Desk
Update: 2026-11-15 09:37 GMT

ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్న బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న బియ్యం వ్యాపారులపై చర్యలతోపాటు అక్రమ నిల్వలను వెలికి తీయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న చర్యలతో బియ్యం ధరలపై నియంత్రణ ఉంటుందని భావిస్తున్నారు. ఎల్ నినో సాకుతో బియ్యం ధరలను ఎడాపెడా పెంచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం రూ.1250 నుంచి రూ.1500 మధ్య లభించిన 26 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు రూ.2,000 వేల నుంచి రూ.3,000 వేలకు పెరిగింది. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం ఎక్కువగా వాడే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుందని చెబుతున్నారు.

ధాన్యం, బియ్యం నిల్వలపై నిరంతర నిఘా ఉంచడమే కాకుండా, రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వలను ప్రతివారం ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో స్టాక్ లిమిట్స్ పైనా కేంద్ర స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వినియోగదారులపై అధిక భారం పడకుండా బియ్యం అక్రమ నిల్వలను గుర్తించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీసు అధికారులతో ప్రత్యేక టాస్క్ పోర్సులను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 294 బృందాలను రంగంలోకి దించడమే కాకుండా విస్తృత సోదాలకు ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. ఈ ప్రత్యేక బృందాలు కొద్దిరోజులుగా తనఖీలు చేపట్టి 516 కేసులు నమోదు చేశాయని, రూ.10.43 కోట్ల సరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై నిరంతర నిఘా వేయడంలో భాగంగా అధికారులు తీసుకున్న చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా 159 టన్నుల బియ్యం, రెండు వేల టన్నుల ధాన్యం, 832 కిలోల కందిపప్పు, 1930 లీటర్ల వంట నూనె, 9.3 టన్నుల ఇతర నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. ఈ చర్యలతో అక్రమ నిల్వలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అన్నిటికన్న ముఖ్యంగా సన్న బియ్యం ధరలు అదుపు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఎల్ నినో భయంతో ఈ ఏడాది బియ్యం దిగుబడులు భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని జరిగిన ప్రచారాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో అక్రమ నిల్వలకు తెరతీసినట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పంట దిగుబడులు రాకముందే రూ.50 ఉన్న కిలో బియ్యం రూ.90కి ఎగబాకింది. దీంతో సామాన్యుడిపై పెనుభారం పడిందని అంటున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. మూడు వారాలుగా ప్రభుత్వ పర్యవేక్షణ పెరగడంతో ప్రస్తుతం ధరల పెరుగుదల ఆగిందని చెబుతున్నారు. లేనిపక్షంలో ప్రతివారం బియ్యం ధరలను క్వింటాకు వంద నుంచి రెండు వందలు పెంచేవారని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బియ్యం నిల్వలను తెలుసుకుని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయాలు సాగాలని అధికారులు నిర్ణయించారని అంటున్నారు. ఈ మేరకు మిల్లర్లు, బియ్యం వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. బియ్యం ధరలను కూడా ఖరారు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం బీపీటీ (సోనా), బీపీటీ (సాంబ), కేఎన్ఎం రకాల బియ్యం ధర కిలో రూ.66కి విక్రయించాలి. అంతకుమించి ఒక్కరూపాయి కూడా పెంచి అమ్మకూడదని ప్రభుత్వం నిషేధం విధించింది. అదేవిధంగా హెఎంటీ, ఆర్ఎన్ఆర్ రకాలకు రూ.76, జైశ్రీరామ్ రూ.82, ఎంటీయూ సాధారణ రకాలు రూ.47కు విక్రయించాలని స్పష్టం చేసింది. ఈ ధరలను ప్రతివ్యాపారి పాటించాలని తెలిపింది. ప్యాకింగ్ పై పాత తేదీలు ఉన్నప్పటికీ కొత్త ధరలకే బియ్యం విక్రయించాలని ఆదేశించింది. దీంతో కొద్ది రోజుల్లో బియ్యం ధరలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Tags:    
  • riceprices 
  • ricepricehike 
  • ricehoarding 
  • ricepricesindia 
  • essentialcommodities 

Similar News

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

యాపిల్స్‌పై వ్యాక్స్ పూస్తారా? తినే ముందు ఈ విషయం తెలుసుకోండి

2026-10-30 05:22 GMT

కల్తీ ఆహారంతో ప్రాణాలకు ముప్పు.. తినే ముందు జాగ్రత్త!

2026-10-17 16:30 GMT

వెజ్ ఫుడ్ ..బాబోయ్ అనొద్దు బ్రో !

2026-10-01 05:02 GMT

'ప‌నీర్ విషం'పై ఫుడ్ సేఫ్టీ కొత్త నిబంధ‌నలు.. 'నాన్ డెయిరీ ప‌నీర్' నిషేధం!

2026-09-25 04:01 GMT

తెలంగాణ‌ లో అన‌లాగ్ ప‌న్నీర్ పై నిషేధం.. ఎందుకు.. ఏంటా స్టోరీ?!

2026-09-12 09:43 GMT

ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకెట్స్ పై రెడ్ వార్నింగ్? అసలు దీని అర్థం ఏంటో తెలుసా?

2026-08-30 00:30 GMT

హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ కు షాక్.. తాజాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు

2026-07-08 08:11 GMT

అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవం.. తినేద్దామా మరోసారి!

2026-07-05 06:03 GMT

రాజభోగం అంటే ఇదే..కోట్ల విలువ చేసే ఐస్‌క్రీమ్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-06-07 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS