• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Finance >  ఈ సంపత్ లో అదరగొట్టే...

ఈ సంపత్ లో అదరగొట్టే షేర్లు ఇవేనట.. ఎవరు చెప్పారంటే?

| గతంలో పరిమిత సమూహానికి మాత్రమే చూసే షేర్ మార్కెట్ లోకి ఇప్పుడు నూనూగు మీసాలు వస్తున్న వేళలోనే పెట్టుబడులు పెట్టేస్తున్న రోజులివి.

By - Tupaki Desk
Update: 2023-11-12 05:05 GMT

గతంలో పరిమిత సమూహానికి మాత్రమే చూసే షేర్ మార్కెట్ లోకి ఇప్పుడు నూనూగు మీసాలు వస్తున్న వేళలోనే పెట్టుబడులు పెట్టేస్తున్న రోజులివి. క్యాలెండర్ ఇయర్ జనవరి - డిసెంబరు అయితే.. విద్యా క్యాలెండర్ ఇయర్ జూన్ - ఏప్రిల్ గా చెబుతారు. అదే.. వ్యాపార క్యాలెండర్ చూస్తే ఏప్రిల్ - మార్చి. మరి.. షేర్ మార్కెట్ ట్రేడింగ్ కు సంప్రదాయ బద్ధంగా దీపావళి - దీపావళిగా లెక్కలేస్తారు. ఈ కాలాన్ని సంపత్ కాలంగా పేర్కొంటారు. 2079 సంపత్ ట్రేడింగ్ శుక్రవారంతో పూర్తి కాగా.. సరికొత్త సంపత్ ట్రేడింగ్ (2080) ఈ రోజు (ఆదివారం) నుంచి మొదలు కానుంది.

దీపావళి రోజున గంట పాటు ప్రత్యేకంగా ట్రేడ్ జరగటంతో మొదలయ్యే సరికొత్త సంపత్ ఏడాది.. రానున్న రోజుల్లో కొన్ని షేర్లు పెట్టుబడులకు అనుకూలమైనవిగా పేర్కొంటూ కొన్ని సంస్థలు తమ అంచనాలు వెల్లడించాయి. సిరులు ఒలికించే స్టాక్ మార్కెట్ లో మదుపరులు ఏ షేర్ల మీద పెట్టుబడులు పెట్టొచ్చన్న అంచనాను కొన్ని బ్రోకరేజ్ సంస్థలు వెల్లడించాయి. ఈ రోజుతో మొదలయ్యే కొత్త సంపత్ లో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయని చెప్పాలి. ఈ నెలలో ఆరు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండగా.. వచ్చే ఏడాది మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏడాది బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. జాగ్రత్తలు తీసుకుంటూ ట్రేడింగ్ చేసే వారికి బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పుడు పేర్కొనే అంచనాలన్ని కూడా ఆయా బ్రోకరేజ్ సంస్థలు వెల్లడించిన వివరాలే అన్నది మర్చిపోకూడదు. వీటిల్లో పెట్టుబడులుపెట్టొచ్చా? లేదా? అన్నది ఎవరికి వారు తీసుకోవాల్సిన వ్యక్తిగత అభిప్రాయం. ఆయా సంస్థలు రికమెండ్ చేసిన స్టాక్ లో డబ్బులు పెట్టే ముందు మరింత అధ్యయనం చేయటం అవసరమన్నది మర్చిపోకూడదు. ఇంతకూ ఆయా సంస్థలు ఏయే షేర్లను రికమెండ్ చేశాయన్న విషయంతో పాటు రానున్న ఏడాదిలో ఎంత మేరకు వెళతాయన్న అంచనాను ఇవ్వటం గమనార్హం.

హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీ అంచనాల్ని చూస్తే..

షేర్ అంచనా ధర (రూ)

డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ 6250

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 112

గెయిల్ (ఇండియా) 140

గోద్రెజ్ ఇండస్ట్రీస్ 735

గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 2275

గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ 875

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 103

కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ 795

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2695

యునైటెడ్ స్పిరిట్స్ 1195

మోతీలాల్ ఓస్వాల్

షేర్ అంచనా ధర(రూ)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 700

టైటన్ 3900

ఎంఅండ్ ఎం 1770

సిప్లా 1450

ఇండియన్ హోటల్స్ 480

దాల్మియా భారత్ 2800

కేన్స్ టెక్ 3100

రేమండ్ 2600

స్పందన స్ఫూర్తి 1100

రెస్టారెంట్ బ్రాండ్స్ ఆసియా 135

ఐసీఐసీఐ డైరెక్ట్

కంపెనీ అంచనా ధర (రూ)

ఎల్ అండ్ టీ 3560

కోరమాండల్ ఇంటర్నేషనల్ 1330

ఎస్ బీఐ 725

స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ 1100

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1260

యాక్సిస్ సెక్యూరిటీస్

సంస్థ అంచనా ధర (రూ)

టీవీఎస్ మోటార్స్ 2100

భారతీ ఎయిర్ టెల్ 1155

ఏపీ ఎల్ అపోలో ట్యూబ్స్ 1950

జ్యోతి ల్యాబ్స్ 440

కేపీఐటీ టెక్నాలజీ 1500

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 1800

ఆస్ట్రాల్ 2150

అహ్లువాలియా కాంట్రాక్ట్స్ 770

ఎస్ బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1535

నిర్మల్ బాంగ్

సంస్థ అంచనా ధర (రూ)

ఆర్చియాన్ కెమికల్ ఇండస్ట్రీ 767

ఎలికాన్ ఇంజినీరింగ్ 1050

ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ 1100

ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ 820

సాయి సిల్స్ (కళామందిర్) 323

సంఘ్వీ మూవర్స్ 864

ఎస్ఆర్ఎఫ్ 2637

వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ 1830

విష్ణు కెమికల్స్ 421

విష్ణు ప్రకాశ్ ఆర్ పుంగాలియా 262

ఆనంద్ రాఠి

సంస్థ అంచనా ధర (రూ)

సిర్మా ఎస్ జీఎస్ టెక్నాలజీ 735

ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ 114

డీఎల్ఎఫ్ 640

ఎంటార్ టెక్నాలజీస్ 2970

టీవీఎస్ మోటార్ కంపెనీ 1850

మహీంద్రా అండ్ మహీంద్రా 1770

Tags:    
  • Shares 
  • Stockmarket 
  • Finance 
  • Latestnews 

Similar News

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

సొంతింటి కల.. 50 ఏళ్ల వయసు మీరిన వేళ పెద్ద రిస్కేనా? రిటైర్మెంట్ లెక్కలివే..

2026-10-27 09:31 GMT

జియో ఐపీఓకు రికార్డు స్పందన.. ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయా?

2026-10-24 05:23 GMT

చమురు ధరలే కారణం కాదు.. రూపాయిని దెబ్బతీస్తున్న ప్రపంచ పెట్టుబడుల మార్పు

2026-10-22 18:30 GMT

తొలిరోజే రూ.95,500 కోట్ల బిడ్లు.. జియో ఐపీఓపై ఇంత క్రేజ్ ఎందుకు?

2026-10-22 10:24 GMT

పేటీఎం బ్యాంక్ లైసెన్స్ రద్దు.. UPI పేమెంట్లు రీఛార్జుల సంగ‌తేంటి?

2026-04-25 03:46 GMT

వీసా.. మాస్టర్.. రూపే కార్డుల్లో ఏది ఎక్కువ యూజ్ ఫుల్?

2025-12-19 04:38 GMT

రాకెట్ స్పీడ్ లో మస్క్ సంపద.. సెకనుకు ఎంతో తెలుసా..!

2025-12-17 10:06 GMT

40 ఏళ్ల క్రితం సెన్సెక్స్ లో టాప్.. ఇప్పుడు వాటి పరిస్థితి తెలిస్తే షాక్

2025-12-15 05:30 GMT

ప్రపంచాన్ని అప్పు ట్రాప్ లో పడేస్తున్న చైనా

2025-11-28 07:30 GMT

ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్లలో పెను తుఫాను

2025-11-23 05:44 GMT

ట్రంప్ సర్కారుపై ‘రిచ్ డాడ్’ రైటర్ కీలక పోస్టు.. అదేమంటే?

2025-09-18 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS