• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Finance >  ఇంకా ప్రజల వద్దే రూ.2వేల...

ఇంకా ప్రజల వద్దే రూ.2వేల నోట్లు.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే?

| ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ ప్రజల వద్ద రూ. 6,471 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు మిగిలి ఉన్నట్లు ఆర్బీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది.

By - Tupaki Desk
Update: 2025-03-02 01:30 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రద్దు అయిపోయిన రూ.2వేల నోట్లు ఇంకా ప్రజల వద్దనే కొన్ని ఉన్నాయన్న విషయాన్ని ఆర్బీఐ బయటపెట్టింది. ఇదే ఇప్పుడు సంచలనమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 మేలో రూ. 2 వేల నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలకు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకులకు తిరిగి అందజేయాలని సూచించింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ ప్రజల వద్ద రూ. 6,471 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు మిగిలి ఉన్నట్లు ఆర్బీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది.

- 98.18% నోట్లు బ్యాంకులకు చేరిక

2023 మే 19న ఆర్బీఐ ఈ నోట్ల ఉపసంహరణ ప్రకటన చేసినప్పుడు, సర్క్యులేషన్‌లో మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఉన్నట్లు అంచనా వేసింది. ముందుగా బ్యాంకుల్లో మార్చుకునే అవకాశాన్ని 2023 సెప్టెంబర్ 30 వరకు ఇచ్చి, తర్వాత అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అయితే, అప్పటి నుంచి బ్యాంకుల ద్వారా మార్చుకునే అవకాశం నిలిపివేసి, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్పిడికి అనుమతి ఇచ్చింది.

ఇప్పటివరకు 98.18% నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి చేరినప్పటికీ 1.82% నోట్లు (రూ. 6,471 కోట్లు) ఇంకా ప్రజల వద్ద ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది.

- నోట్ల మార్పిడికి అందుబాటులో ఉన్న కేంద్రాలు

ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2 వేల నోట్ల మార్పిడికి వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పుర్, ఢిల్లీ, పట్నా, తిరువనంతపురం, చెన్నై, ఛండీగఢ్, భువనేశ్వర్, భోపాల్, భేల్‌పుర్, కాన్పుర్, జైపూర్, గువాహటి, లక్నో, కోల్‌కతా, జమ్మూ ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఆర్బీఐ కార్యాలయాలకు వ్యక్తిగతంగా వెళ్లలేని వారు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా తమ నోట్లను పంపించవచ్చు.

- రూ. 2 వేల నోట్ల లీగల్ టెండర్ స్థితి

రూ. 2 వేల నోట్లను ఉపసంహరించినప్పటికీ, ఇవి ఇప్పటికీ చట్టబద్ధ కరెన్సీ (లీగల్ టెండర్)గా కొనసాగుతున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే ఈ నోట్లు చెల్లుబాటు అయ్యే కరెన్సీగానే కొనసాగుతున్నాయని స్పష్టత ఇచ్చింది.

Tags:    
  • RBI 
  • 2000RupeeNote 
  • Demonetization 
  • CurrencyUpdate 
  • RBINews 
  • IndianEconomy 
  • LegalTender 
  • CashWithdrawal 
  • FinancialNews 
  • BankingUpdates 

Similar News

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

సొంతింటి కల.. 50 ఏళ్ల వయసు మీరిన వేళ పెద్ద రిస్కేనా? రిటైర్మెంట్ లెక్కలివే..

2026-10-27 09:31 GMT

జియో ఐపీఓకు రికార్డు స్పందన.. ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయా?

2026-10-24 05:23 GMT

చమురు ధరలే కారణం కాదు.. రూపాయిని దెబ్బతీస్తున్న ప్రపంచ పెట్టుబడుల మార్పు

2026-10-22 18:30 GMT

తొలిరోజే రూ.95,500 కోట్ల బిడ్లు.. జియో ఐపీఓపై ఇంత క్రేజ్ ఎందుకు?

2026-10-22 10:24 GMT

పేటీఎం బ్యాంక్ లైసెన్స్ రద్దు.. UPI పేమెంట్లు రీఛార్జుల సంగ‌తేంటి?

2026-04-25 03:46 GMT

వీసా.. మాస్టర్.. రూపే కార్డుల్లో ఏది ఎక్కువ యూజ్ ఫుల్?

2025-12-19 04:38 GMT

రాకెట్ స్పీడ్ లో మస్క్ సంపద.. సెకనుకు ఎంతో తెలుసా..!

2025-12-17 10:06 GMT

40 ఏళ్ల క్రితం సెన్సెక్స్ లో టాప్.. ఇప్పుడు వాటి పరిస్థితి తెలిస్తే షాక్

2025-12-15 05:30 GMT

ప్రపంచాన్ని అప్పు ట్రాప్ లో పడేస్తున్న చైనా

2025-11-28 07:30 GMT

ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్లలో పెను తుఫాను

2025-11-23 05:44 GMT

ట్రంప్ సర్కారుపై ‘రిచ్ డాడ్’ రైటర్ కీలక పోస్టు.. అదేమంటే?

2025-09-18 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS