YRF 'రైటర్స్' కాల్.. ఏంటి విషయం?

తాజాగా రైటర్స్ కాల్ ను అనౌన్స్ చేసింది. బాలీవుడ్ లో కెరీర్‌ ను నిర్మించుకోవాలనుకునే యువ, ఆశావహ రచయితలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించింది.;

Update: 2025-10-03 21:30 GMT

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ -YRF గురించి తెలిసిందే. 55 ఏళ్ల క్రితం ఫిల్మ్ మేకర్ యష్ చోప్రా స్థాపించిన ఆ బ్యానర్ ను ఇప్పుడు ఆయన కుమారుడు ఆదిత్య చోప్రా నడిపిస్తున్నారు. ఇప్పటికే యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి.

బాలీవుడ్ సినిమాలను నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూట్ చేస్తూ బిజీగా ఉన్న యష్ రాజ్ సంస్థ.. హిందీ చలనచిత్ర పరిశ్రమను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పాలి. తాజాగా రైటర్స్ కాల్ ను అనౌన్స్ చేసింది. బాలీవుడ్ లో కెరీర్‌ ను నిర్మించుకోవాలనుకునే యువ, ఆశావహ రచయితలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించింది.

"హిందీ చిత్ర పరిశ్రమలో కెరీర్‌ ను నిర్మించుకోవాలనుకునే రచయితలకు YRF స్క్రిప్ట్ సెల్ కాల్. వినూత్నమైన, ఆకర్షణీయమైన ఆలోచనలను తీసుకురాగల తదుపరి తరం ఆలోచనా పరులను కనుగొనాలనుకుంటున్నాం. చెప్పడానికి కథ ఉండి, మమ్మల్ని చేరుకునే అవకాశం లేని వారిని కనుగొనడమే మా ప్రయత్నం" అని చెప్పింది.

మీ ఆలోచన ఆకర్షణీయమైనదిగా, మరింత అభివృద్ధి చేయదగినదిగా మేం భావిస్తే, మా బృందం స్క్రీన్‌ ప్లేను అభ్యర్థిస్తుందని చెప్పింది. వెబ్ సైట్ లో స్క్రిప్ట్ అప్లోడ్ చేయమని కోరుతూ గుడ్ లక్ తెలిపింది. దీంతో ఇండస్ట్రీలో తమ కథలను పంచుకోవడానికి ఆసక్తి ఉన్న రైటర్స్ కు కొత్త అవకాశాలను అందించనుంది యష్ రాజ్ సంస్థ.

అయితే రైటర్స్ కు ఇండస్ట్రీకి మధ్య ఉన్న గ్యాప్ తగ్గించాలని యష్ సంస్థ చూస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొత్త స్టోరీస్ తో సినిమాలు తీసే ప్లాన్ లో బ్యానర్ ఉన్నట్లు ఉందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం యష్ రాజ్ ఫిల్మ్స్ .. ఏదో కొత్త స్ట్రాటజీతో ఇప్పుడు ఇండస్ట్రీ ముందుకు వచ్చిందని ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే కొందరు రచయితలు ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, అందుకే ఇప్పుడు కొత్త వాళ్లను తీసుకొచ్చి తక్కువ పారితోషికం ఇచ్చి సినిమాలు తీస్తుందేమోనని అనుమానపడుతున్నారు. కానీ వాటిని పలువురు ఖండిస్తున్నారు. యష్ రాజ్ సంస్థ.. టాలెంట్ కు వాల్యూ ఇస్తుందని, ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ ఎదుగదల కోసమే అలా చేస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News