• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యేవమ్ టీజర్… ఎలా ఉందంటే..

యేవమ్ టీజర్… ఎలా ఉందంటే..

| చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, ఆషు రెడ్డి, భరత్ రాజ్ ప్రధాన పాత్రలలో ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యేవమ్.

By - Tupaki Desk
Update: 2024-05-24 11:15 GMT

చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, ఆషు రెడ్డి, భరత్ రాజ్ ప్రధాన పాత్రలలో ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యేవమ్. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రం సిద్ధం అవుతోంది. ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్, సిస్పేస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఒకరి మీద శృతిమించిన వ్యామోహం ఎన్ని ఘోరాలైన చేయిస్తుంది అనే ఎలిమెంట్ తీసుకొని యేవమ్ ని తెరకెక్కించినట్లు ఉంది.


తెలుగమ్మాయి చాందిని చౌదరికి కలర్ ఫోటో మూవీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అక్కడి నుంచి అడపాదడపా అవకాశాలు అందుకుంటూ వస్తోంది. యేవమ్ చిత్రంలో చాందిని చౌదరి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. పోలీస్ జాబ్ సంపాదించి కొత్తగా ఏఎస్సైగా డ్యూటీలో జాయిన్ అయిన చాందిని చౌదరి స్థానికంగా జరిగే హత్యల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది.

ఒక ఫోక్ సాంగ్ తో టీజర్ ని స్టార్ట్ చేసి అషురెడ్డి, వశిష్ట సింహ పాత్రలతో ఎస్టాబ్లిష్ చేశారు. తరువాత చాందిని చౌదరిని కొత్తగా డ్యూటీలో ఏఎస్సైగా పరిచయం చేశారు. అనంతరం విలేజ్ లో జరిగే వరుస హత్యలు. వాటిపై చాందిని చౌదరి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. గంగాధర్ అనే పేరుతో ఆమెకి ఫోన్ వచ్చి ఆ హత్యలన్నీ చేసింది నేనే అని ఓ అజ్ఞాత వ్యక్తి చెబుతాడు. అతన్ని పట్టుకోవడానికి చాందిని చౌదరి వెళ్తుంది. ఆమెని కనిపించకుండా మోహించే వ్యక్తిగా వశిష్ట సింహ కనిపిస్తున్నాడు.

ఈ టీజర్ ఆరంభంలోనే అషురెడ్డి క్యారెక్టర్ ని పరిచయం చేసి ఆమెని కూడా కిరాతకంగా చంపినట్లు చూపించారు. ఓవరాల్ గా టీజర్ చూస్తుంటే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దారుణంగా హత్యలు చేసే ప్రతినాయకుడిగా వశిష్ట సింహ కనిపిస్తున్నాడు. అతని నుంచి తనని తాను కాపాడుకొని, హత్యలని ఎలా నిలువరించింది అనేది ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీలో భరత్ రాజ్ ఆమెని ప్రేమించే ఎస్సై పాత్రలో కనిపిస్తున్నాడు. నవదీప్, పవన్ గోపరాజు ఈ చిత్రానికి నిర్మాతలుగాఉన్నారు. కీర్తన శేష్, నీలేష్ మందలపు మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ ఉండబోతోందని టీజర్ లో తెలిపారు. ఓ విధంగా చాందిని చౌదరి లీడ్ రోల్ లో చేస్తోన్న ఫీమేల్ సెంట్రిక్ మూవీగానే యేవమ్ చిత్రం రాబోతోందని టీజర్ బట్టి స్పష్టం అవుతోంది. మరి ఆమెకి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది వేచి చూడాలి.

Full View


Tags:    
  • Yevam 
  • Vasishtasimha 
  • Chandinichowdary 
  • Tollywood 
  • Filmindustry 
  • Harishshankar 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS