• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏడాదిన్నరగా అదే మాట......

ఏడాదిన్నరగా అదే మాట... మీరు గర్వ పడేలా చేస్తా

| కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల అయ్యి దాదాపుగా రెండేళ్లు కాబోతుంది. అయినా కూడా ఇప్పటి వరకు హీరో యష్‌ కొత్త సినిమా ను ప్రకటించలేదు.

By - Tupaki Desk
Update: 2023-11-24 17:30 GMT

కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల అయ్యి దాదాపుగా రెండేళ్లు కాబోతుంది. అయినా కూడా ఇప్పటి వరకు హీరో యష్‌ కొత్త సినిమా ను ప్రకటించలేదు. కేజీఎఫ్‌ 2 సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యం లో మళ్లీ అదే రేంజ్‌ లో తన సినిమా ఉండాలనే గట్టి పట్టుదలతో యష్‌ కథ లు వింటున్నాడు అంటూ సమాచారం అందుతోంది.

ఆయన వద్దకు ఎన్నో కథలు వచ్చాయట, ఎంతో మంది ప్రముఖ దర్శకులు, కొత్త దర్శకులు వచ్చారట. కానీ యష్‌ ఇప్పటి వరకు కొత్త సినిమాకి కమిట్ అవ్వలేదు. గత ఏడాదిన్నర కాలంగా అభిమానులు యష్‌ ప్రకటన కోసం వెయిట్‌ చేస్తున్నారు. అయినా కూడా యష్ నుంచి మాత్రం ప్రకటన రాలేదు. ఏ ప్రత్యేక సందర్భంలో అయినా యష్‌ నుంచి ఒకే మాట వస్తోంది.

తన నుంచి రాబోతున్న సినిమా అభిమానులు అంతా కూడా గర్వించే విధంగా ఉంటుంది, ఇన్నాళ్లు వెయిట్‌ చేసినందుకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని చెబుతూ వస్తున్నాడు. తాజాగా మరోసారి యష్‌ అవే వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల యష్ ఒక ప్రైవేట్‌ ఈవెంట్‌ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా తదుపరి సినిమా గురించి యష్ ను ప్రశ్నించిన సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశాడు.

యష్ మాట్లాడుతూ... నేను ఏం చేసినా కూడా అందరూ గర్వించేలా చేస్తాను. ఇప్పటి వరకు తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయలేదు. కానీ కొందరు మాత్రం ఏ పండుగ వచ్చినా, బర్త్‌ డే వచ్చినా కూడా అభిమానులను కన్ఫ్యూజ్ అయ్యేలా చేస్తున్నారు. మామూలు పనులు చేసి, కాలం నెట్టుకు వెళ్లడం నాకు ఇష్టం ఉండదు. అందుకే తదుపరి సినిమా ఆలస్యం అవుతుంది అన్నాడు.

కేజీఎఫ్‌ 2 వంటి సినిమాతోనే వస్తాను అంటే కుదరదు అంటూ చాలా మంది యష్ కి చెప్పి చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం కచ్చితంగా ఒక భారీ సినిమా ని మాత్రమే చేయాలని పట్టుదలతో ఉన్నాడు. మరి ఆ భారీ సినిమా ఎప్పటికి సెట్‌ అయ్యేను.. ఒక వేళ అయినా కూడా అది కేజీఎఫ్ రేంజ్ లో ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. మొత్తానికి యష్ మాత్రం మళ్లీ మళ్లీ అదే మాట చెప్పి అభిమానుల సహనం ను పరీక్షిస్తున్నాడు అనిపిస్తోంది.

Tags:    
  • yash 
  • Kgf 
  • Kgf2 
  • Prasanthneel 
  • Nextmove 
  • Geetumohandas 
  • Filmindustry 
  • Kannada 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS