టాక్సిక్ రిజల్ట్.. యశ్ మార్కెట్ కు డబుల్ బూస్ట్ ఇలా!

కేజీఎఫ్ తో ఇండియన్ బాక్సాఫీస్‌ కు రాఖీ భాయ్ అంటే ఏంటో చూపించిన యశ్.. ఇప్పుడు మరో బిగ్ గేమ్ కు రెడీ అవుతున్నారు.

Update: 2026-09-07 02:23 GMT

కేజీఎఫ్ తో ఇండియన్ బాక్సాఫీస్‌ కు రాఖీ భాయ్ అంటే ఏంటో చూపించిన యశ్.. ఇప్పుడు మరో బిగ్ గేమ్ కు రెడీ అవుతున్నారు. టాక్సిక్ తో ఆశించిన రేంజ్‌ లో మెప్పించలేకపోయినా.. యశ్ మార్కెట్ మాత్రం అంత ఈజీగా డౌన్ అవుతుందా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న నెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్.. నార్మల్ మూవీ కాదు. భారీ రేంజ్ లో రూపొందుతున్న రామాయణ సినిమా.

యశ్ కెరీర్‌ లో కేజీఎఫ్ ఒక రేంజ్ సెట్ చేసింది. ఆ సినిమా తర్వాత ఆయన ఏం చేసినా పాన్ ఇండియా లెక్కల్లోనే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే టాక్సిక్ విషయంలో మాత్రం అంచనాలకు, రిజల్ట్ కు మధ్య గ్యాప్ కనిపించింది. దీంతో యశ్ తర్వాత స్టెప్ ఏంటి? ఆయన మార్కెట్‌పై దాని ప్రభావం ఎంత? అనే చర్చ మొదలైంది. కానీ ఇక్కడే రామాయణ గేమ్‌ లోకి వస్తోంది. సినిమాలో యశ్ హీరో కాదు.. రావణుడు.

ఎందుకంటే హీరోగా భారీ మాస్ ఇమేజ్ తెచ్చుకున్న స్టార్.. ఇంత పవర్‌ ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకోవడం చిన్న విషయం కాదు. పైగా ప్రతి ఒక్కరికీ తెలిసిన కథలో రావణుడిగా కనిపించబోతున్నారు. అంటే రోల్ కు ముందే ఒక బ్రాండ్ ఉంది. దానికి యశ్ ఇమేజ్ యాడ్ అయితే ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు అసలు క్యూరియాసిటీ. ఇప్పటివరకు యశ్ మార్కెట్‌ ను ఎక్కువగా యాక్షన్ సినిమాలు నడిపించాయి.

కేజీఎఫ్ ఆయనకు మాస్ హీరోగా తిరుగులేని గుర్తింపు తీసుకొచ్చింది. రామాయణ మాత్రం ఆ ఇమేజ్‌ ను మరో యాంగిల్ లో చూపించే అవకాశం ఇస్తోంది. రావణుడి పాత్ర క్లిక్ అయితే.. యశ్ కేవలం యాక్షన్ స్టార్ కాదని, ఎలాంటి క్యారెక్టర్‌ లోనైనా తన స్క్రీన్ ప్రెజెన్స్‌ తో మార్కెట్‌ ను రాబట్టగలడనే నమ్మకం మరింత బలపడుతుంది. ఇక బాలీవుడ్ మార్కెట్ విషయంలో కూడా రామాయణ కీలకంగా మారొచ్చు.

రణబీర్ కపూర్ రాముడిగా.. యశ్ రావణుడిగా కనిపించనున్న ఆ కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్, ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుందన్నది సినిమాకు పెద్ద హైలైట్‌ గా మారే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రామాయణ రెండు పార్టులుగా రాబోతోంది. దీంతో యశ్‌ కు ఇది ఒక్క సినిమాతో ముగిసే ఛాన్స్ కాదు. మొదటి భాగంతో రావణుడి పాత్రపై ఆసక్తి పెరిగితే.. రెండో భాగానికి ఆ హైప్ మరింత పెరగొచ్చు.

అంటే యశ్ మార్కెట్‌ కు ఒకేసారి కాకుండా.. రెండు స్టేజెస్ లో బూస్ట్ దక్కే అవకాశం ఉంది. అందుకే టాక్సిక్ రిజల్ట్ బట్టి యశ్ మార్కెట్‌ కు డౌన్‌ ఫాల్ వచ్చేసిందని ఫిక్స్ అయిపోవడం తొందరపాటే. అసలు రాఖీ భాయ్ మార్కెట్ ఎంత స్ట్రాంగ్‌ గా ఉందో మరోసారి తేల్చే సినిమా రామాయణ. ఒక్కవేళ రావణుడిగా యశ్ అదరగొట్టి.. బాక్సాఫీస్ దగ్గర మూవీ బ్లాక్‌ బస్టర్ అయితే లెక్కలు మారిపోవచ్చు. అందుకే ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News