• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాకీ భాయ్‌ రేంజ్ ను పెంచే...

రాకీ భాయ్‌ రేంజ్ ను పెంచే క్యారెక్టర్లు.. క్లిక్కయితే అరాచకమే..

| 2026 సంవత్సరం యష్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2025-04-23 03:15 GMT

2026 సంవత్సరం యష్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. యష్ నుంచి రాబోయే నెక్స్ట్ రెండు పెద్ద సినిమాలు కూడా మంచి బజ్ తో ఉన్నవే. ఆ రెండు సినిమాల్లో అతను వేరే వేరే గెటప్స్‌తో కనిపించనున్నాడు. ఇది ‘రాకీ భాయ్’ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఎంత వరకూ వర్కౌట్ అవుతాయనేది ఆసక్తికరం. ఇప్పటికే నితిష్ తివారి తీస్తున్న రామాయణ చిత్రంలో యష్ రావణాసురుడిగా నటిస్తున్నట్లు ఖరారు అయిపోయింది.

ఇదొక పవర్ఫుల్ హై వోల్టేజ్ పాత్ర. మతపరమైన భావోద్వేగాలతో నిండిన పాత్ర. ఇదే సమయంలో ఆయన టాక్సిక్ అనే డార్క్ ఫాంటసీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా ఫిక్షనల్ మాస్, స్టైలిష్ విజువల్స్‌తో నిండినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఒకవైపు పురాణ పాత్ర, ఇంకొకవైపు హైపర్ మోడ్రన్ లుక్. ఒకే ఏడాది ఈ రెండు భిన్నమైన క్యారెక్టర్లు యష్‌కి ఉహించుని ఫలితాల్ని ఇవ్వగలవు.

ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే.. ‘కేజీఎఫ్’ తర్వాత యష్‌కి ప్రేక్షకులలో ఏర్పడిన మాస్ ఇమేజ్. పాన్ ఇండియా వేదికపై హై రేంజ్ క్రేజ్ తెచ్చింది మాత్రం రాకీ భాయ్ క్యారెక్టర్. ఇప్పుడు అదే స్థాయిలో మరో క్యారెక్టర్ నిలబడాలంటే, అది అందరినీ అంతకుమించి ఆకట్టుకోవాలి. రామాయణలో రావణుడిగా కనిపించబోతున్న యష్, తన గత పాత్రలకంటే బాగా డిఫరెంట్‌గా ఉండేలా ప్రెజెంట్ అవుతాడా అనేది అసలు పాయింట్. ఆ పాత్ర ఆడియన్స్‌కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుంది? వాళ్ల మైండ్‌లో కొత్తగా వేరొక పర్సనాలిటీగా నిలవగలరా? అనేది అసలు డౌట్. కానీ క్యారెక్టర్ క్లిక్కయితే మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు.

దాదాపు ప్రభాస్ రేంజ్ లోనే యష్ క్రేజ్ పెరుగుతోంది. బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, కల్కి 2898 A.D. వంటి సినిమాల్లో కనిపించాడు. అందులో కల్కి వంటి సినిమాతో మళ్లీ ప్రభాస్ ఫామ్‌కి వచ్చాడు. యష్‌కు కూడా ఇప్పుడు అలాంటి అవకాశమే ఉంది. ఇక సినిమాల కథ, ట్రీట్మెంట్, ప్రమోషన్స్ ఎలా ఉంటాయన్నదే అతని భవిష్యత్తును నిర్ణయించగలదు.

ఇంకా టాక్సిక్ విషయంలో ప్రత్యేకించి ఒక పాయింట్ చెప్పుకోవాలి. ఇది ఒక కన్నడ చిత్రం. దాన్ని హిందీ సహా ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ కన్నడ బేస్‌తో వచ్చిన సినిమాలు, బాలీవుడ్ ప్రేక్షకుల్ని ప్రతీసారి ఆకట్టుకుంటాయన్నది చెప్పలేము. కాబట్టి ప్రమోషన్స్ ఈసారి ఎంతో కీలకం. అనురాగ్ కశ్యప్ లాంటి పేర్లు ఇందులో ఉన్నా సరే, మార్కెటింగ్ స్ట్రాటజీ స్ట్రాంగ్‌గా లేకపోతే సినిమా నేషనల్ లెవెల్‌లో నిలవడం కష్టం. ఫైనల్ గా యష్ కు 2026 కీలకంగా మారింది. రెండు వైవిధ్యమైన పాత్రలు.. ఒకటి పురాణాత్మక పాత్ర, మరొకటి డార్క్ ఫిక్షన్ క్యారెక్టర్.. ఇవి రెండూ యష్‌ని 'నెక్స్ట్ నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా నిలబెడతాయా? అన్నది చూడాలి.

Tags:    
  • Yash2026 
  • KGFStar 
  • YashNext 
  • YashMovies 
  • IndianCinema 
  • Ramayana 
  • ToxicMovie 
  • PanIndiaStar 
  • KGF 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS