'టాక్సిక్' బోయ్ గ్యారేజీలో టాప్-5 కార్లు
రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ స్టార్‌గా వెలిగిపోతున్నాడు. అతడు పాన్ ఇండియాను ఏల్తున్నాడు.;
రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ స్టార్‌గా వెలిగిపోతున్నాడు. అతడు పాన్ ఇండియాను ఏల్తున్నాడు. KGF ఫ్రాంచైజీ తర్వాత అతడు ఏకంగా 4000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న `రామాయణం` ఫ్రాంఛైజీలో నటిస్తున్నాడు. దీనికంటే ముందే అతడు తన యాక్షన్ ఎంటర్ టైనర్ టాక్సిక్ తో కలెక్షన్ల సునామీ సృష్టించడానికి వస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందు, యష్ నేడు తన 40వ పుట్టినరోజును జరుపుకున్నాడు. దశాబ్ధాలుగా జాగ్రత్తగా నిర్మించుకున్న తన సినీ కెరీర్‌తో పాటు అతడి సంపదలు, కార్ కలెక్షన్స్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
అతడి కార్ గ్యారేజీలో ఐదు మోడళ్ల కార్‌లు అత్యంత ఖరీదైనవి. లెక్సస్ ఎల్.ఎక్స్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్ బెంజ్.. వంటి హై-ఎండ్ మోడల్స్ ఉన్నాయి. అవసరానికి ఓ కొత్త మోడల్ ఉపయోగిస్తున్నాడు. ప్రతి ఒక్కటి అతని జీవనశైలికి తగ్గట్టుగా కొనుగోలు చేసినవి. లెక్సస్ ఎల్.ఎక్స్ ధర సుమారు రూ. 2.82 కోట్లు. నాణ్యత, శక్తివంతమైన ఇంజిన్ ..సౌకర్యవంతమైన ఇంటీరియర్‌లతో ఇది లగ్జరీ ఎస్.యు.వి. సుదూర ప్రయాణం- కఠినమైన రహదారి పరిస్థితులను తట్టుకునేందుకు ఈ మోడల్ సహకరిస్తుంది.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ యష్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన కారు. దీని విలువ దాదాపు రూ. 4.38 కోట్లు. ఈ SUVలో చేతితో తయారు చేసిన ఇంటీరియర్‌లు, అధునాతన సాంకేతికత, శక్తివంతమైన డ్రైవ్‌ట్రెయిన్ ఉన్నాయి. ఇది రేంజ్ రోవర్ లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ లగ్జరీ మోడల్‌గా ఉంచబడింది. ఇవేగాక గ్యారేజీలో రెండు మెర్సిడెస్-బెంజ్ ఎస్.యు.విలు కూడా ఉన్నాయి. జీఎల్‌సి 250డి కూపే కార్ ధర సుమారు రూ. 72 లక్షలు. జీఎల్‌సి 350డి విలువ దాదాపు రూ. 78 లక్షలు. రెండు వాహనాలు పనితీరు, సౌకర్యం చాలా ప్రత్యేకం. సిటీ లో అలాగే హైవే డ్రైవింగ్‌కు అనుకూలమైనవి. సుమారు రూ. 1.22 కోట్ల ఖరీదు చేసే టయోటా వెల్‌ఫైర్ స్పేస్ సౌకర్యం అందించే లగ్జరీ ఎంపీవీ. మెత్తటి సీటింగ్ సౌకర్యం, సైలెంట్ క్యాబిన్ దీని ప్రత్యేకతలు. యష్ ఈ కార్లు అన్నిటినీ సందర్భానుసారం ఉపయోగిస్తుంటాడు.
టాక్సిక్ టీజర్ కి అద్భుత స్పందన
యష్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్` టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేసింది. టీజర్ లో `రాయా`గా యష్ విశ్వరూపం మతులు చెడగొడుతోంది. అతడి స్టైలిష్ లుక్ స్టన్నయ్యేలా చేసింది. అతడు రాయా అనే స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఒక స్మశానంలో మాఫియా డాన్ కొడుకు దహన సంస్కారాల వద్ద యష్ ఇచ్చే ఎంట్రీ, ఆయన బాడీ లాంగ్వేజ్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వీడియోలో యష్ మెషిన్ గన్‌తో శత్రువులపై విరుచుకుపడే యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. కార్ లో రొమాన్స్ కూడా నషాళానికి ఎక్కింది. ఈ సినిమా మార్చి 19న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజున రణవీర్ సింగ్ నటించిన `ధురంధర్ 2` విడుదల కాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ కి ఆస్కారం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది.