హార‌ర్ వ‌ర‌ల్డ్ లోకి స్టార్ డైరెక్ట‌ర్ స‌తీమ‌ణి!

బాలీవుడ్ న‌టి యామీ గౌత‌మ్ ఓవైపు కుటుంబ బాధ్య‌త‌లు నెర‌వ‌ర్తిస్తూనే న‌టిగానూ బిజీగా గ‌డుపుతోంది.;

Update: 2026-01-09 11:30 GMT

బాలీవుడ్ న‌టి యామీ గౌత‌మ్ ఓవైపు కుటుంబ బాధ్య‌త‌లు నెర‌వ‌ర్తిస్తూనే న‌టిగానూ బిజీగా గ‌డుపుతోంది.ధాంపత్య జీవితం త‌ర్వాత క‌థ‌ల విష‌యంలో మ‌రింత సెల‌క్టివ్ గా ఉంటుంది. యామీ గౌత‌మ్ తొలి నుంచి గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగానే ఉంది. అవ‌కాశాలు రాలేద‌నో? లేక త‌గ్గాయ‌నో? ఏ రోజు తాను మాత్రం ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌లేదు. ప‌రిమితుల‌కు లోబ‌డే ప‌నిచేసింది. వివాహం త‌ర్వాత మ‌రింత కేర్ పుల్ గా క‌థ‌ల్ని ఎంచుకుంటోంది.ఇటీవ‌లే రిలీజ్ అయిన 'హ‌క్' తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. న్యాయం కోసం పోరాటం చేసే మ‌హిళ పాత్ర‌లో ప్రేక్ష‌కుల్ని ఆటక‌ట్టుకుంది.

అంత‌కు ముందు నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన 'దూమ్ ధామ్' తోనూ బాగానే అల‌రించింది.  'ఆర్టిక‌ల్ 370' తోనూ న‌టిగా మంచి గుర్తింపును ద‌క్కించుకుంది. ఇలా వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో బాలీవుడ్ లో ప్ర‌త్యేక న‌టిగా హైలైట్ అవుతోంది. త్వ‌ర‌లో రిలీజ్ అవుతోన్న 'ధురంధ‌ర్ 2' లో కూడా యామీ న‌టిస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'ధురంధ‌ర్' 1200 కోట్ల వసూళ్లు సాధించ‌డంతో పార్ట్ 2 పై అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. ఇందులో యామీ గౌత‌మ్ భాగ‌మైతే? ఆమె కెరీర్ కి మ‌రింత క‌లిసొస్తుంద‌ని అంచ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఇదే గెస్సింగ్ న‌డుమ యామీ గౌత‌మ్ హార‌ర్ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెట్ట‌డానికి రెడీ అవుతోంది. ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తోన్న 'నయి న‌వేలీ' అనే హార‌ర్ చిత్రంలో యామీ గౌతమ్ ని మెయిన్ లీడ్ కి ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రానికి బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. వీటిని పూర్తి చేసి ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్లాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈజాన‌ర్లో యామీ గౌతమ్ ఇంత వ‌ర‌కూ సినిమాలు చేయ‌లేదు. కెరీర్ లో ఎన్నో సాహ‌సోపేత‌మైన పాత్ర‌లు పోషిం చింది. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లోనూ న‌టించింది. కానీ క‌మ‌ర్శియ‌ల్ పాత్ర‌ల‌కంటే? వైవిథ్యమైన పాత్ర‌లే యామీ గౌత‌మ్ కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చాయి. తొలిసారి హార‌ర్ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెడుతోన్న నేప‌థ్యంలో అక్క‌డా అమ్మ‌డు త‌న‌దైన ముద్ర వేస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే ఈ జాన‌ర్లో శ్ర‌ద్దాక‌పూర్ బ్రాండ్ అంబాసిడర్ గా ముద్ర వేసుకుని స‌త్తా చాటుతోంది. క‌పూర్ బ్యూటీ ఎదురే లేకుండా దూసుకుపోతుంది. అడపా ద‌డ‌పా క‌రీనా క‌పూర్ కూడా ఈజాన‌ర్లో సినిమాలు చేస్తోంది. యామీ గౌత‌మ్ కూడా ఎంట‌ర్ అవ్వ‌డంతో? భ‌విష్య‌త్ లో ఆ ముగ్గురి మ‌ధ్య కొంత పోటీకి అవ‌కాశ‌మైతే ఉంది.

Tags:    

Similar News