• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కోసం రిక్షా కష్టంతో...

పవన్ కోసం రిక్షా కష్టంతో పార్టీ.. అండగా బేబీ నిర్మాత

| ఇక రీసెంట్ గా ఒక పేద మహిళ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం తప్పకుండా అందరికీ పార్టీ ఇస్తాను అని తన భర్త రిక్షా నడిపిస్తాడు అని ఆ కష్టపడిన డబ్బులతోనే అందరికీ ఒక పండుగ లాంటి పార్టీ ఇస్తాను అంటూ ఆమె చాలా ఆనందంగా తెలియజేసింది.

By - Tupaki Desk
Update: 2024-05-14 05:47 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలి అని చాలామంది సినీ ప్రముఖులు బలంగా కోరుకుంటు ఉన్నారు. ఫ్యాన్స్ తో పాటు కొంతమంది సినిమా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వారి అభిమానాన్ని చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండే నిర్మాత ఎస్కేఎన్ అని కూడా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని చెబుతూనే ఉన్నారు.

 

ఇక సోషల్ మీడియాలో జనసేన పార్టీకి సంబంధించిన అనేక రకాల అంశాలపై కూడా ఆయన స్పందిస్తూ ఉండడం విశేషం. ఇక నెగిటివ్ గా కామెంట్ చేసే వారికి కౌంటర్లు ఇవ్వడమే కాకుండా పాజిటివ్ కామెంట్లతో వారికి కూడా ఆయన మద్దతు అందిస్తూ ఉండడం విశేషం. ఇక రీసెంట్ గా ఒక పేద మహిళ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం తప్పకుండా అందరికీ పార్టీ ఇస్తాను అని తన భర్త రిక్షా నడిపిస్తాడు అని ఆ కష్టపడిన డబ్బులతోనే అందరికీ ఒక పండుగ లాంటి పార్టీ ఇస్తాను అంటూ ఆమె చాలా ఆనందంగా తెలియజేసింది.

అయితే ఆమె ప్రేమ, అభిమానానికి చాలామంది ఫ్యాన్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. నిర్మాత SKN కూడా అందుకు సంబంధించిన వీడియో పై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మాత్రం తప్పకుండా ఆ మహిళ భర్తకు తన సొంత డబ్బులతో ఒక ఆటో కొనిస్తాను అని వాగ్దానం చేశాడు. అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

జనసేన పార్టీ ఈసారి తప్పకుండా ప్రభావం చూపుతుంది అని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లో భారీ మెజారిటీతో గెలుపొందుతారు అని ఆయన చెబుతున్నారు. ఇక నిర్మాత ఎస్కేన్ ఇటీవల కాలంలో డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్నాడు. ఆయన స్పీచ్ లకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బేబీ సినిమాతో ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ అందుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇక ప్రస్తుతం మరికొన్ని డిఫరెంట్ సినిమాలను లైన్లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా డైరెక్ట్ పాలిటిక్స్ లోకి రాకుండా పవన్ కళ్యాణ్ కోసం మాత్రం ఆయన పిఠాపురంలో ప్రచారాలు కూడా చేశాడు. ఇక ఎస్కేఎన్ ఎక్కడికి వెళ్లినా కూడా జనసేన ఫాలోవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది.

"పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత నా భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తాను" 🥺Love towards Chief @PawanKalyan in Pithapuram is transcending all demographic barriers ❤️It's going to be a historic mandate ✊#PawanKalyanWinningPithapuram pic.twitter.com/Af2SJHiHxe

— JanaSena Party (@JanaSenaParty) May 13, 2024
Tags:    
  • Andhrapradesh 
  • Pawankalyan 
  • Janasenaparty 
  • Women 
  • Skn 
  • Socialmediaviral 
  • Pithapuram 
  • APElections 
  • Rickshaw 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS