• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాయల్ కు మళ్ళీ అలాంటి...

పాయల్ కు మళ్ళీ అలాంటి ఆఫర్లేనా?

| ఇలాంటి సమయంలో మరల ఆర్ఎక్స్ 100తో పాయల్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన అజయ్ భూపతి మంగళవారం సినిమాలో అవకాశం ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2023-11-22 04:09 GMT

ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతో అటు నటిగా, ఇటు గ్లామర్ బ్యూటీగా తెలుగు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. ఆ మూవీ తర్వాత పాయల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పక్కాగా ఈ బ్యూటీ కమర్షియల్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అంచనా వేశారు. అనుకున్నట్లుగానే వెంకీమామ, డిస్కో రాజా సినిమాలలో స్టార్ హీరోలకి జోడీగా ఆఫర్స్ వచ్చాయి.

తరువాత అనుకున్న స్థాయిలో కెరియర్ ముందుకి సాగలేదు. రెండు, మూడు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేసిన అవి వర్క్ అవుట్ కాలేదు. పాయల్ రాజ్ పుత్ ని అందరూ బోల్డ్ క్యారెక్టర్స్ లోనే చూపించడానికి ఇష్టపడుతున్నారు. క్రమంగా ఆ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో మరల ఆర్ఎక్స్ 100తో పాయల్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన అజయ్ భూపతి మంగళవారం సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఈ మూవీ తాజాగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంది. వల్గారిటీ లేకపోయిన పాయల్ తప్ప ఇంకెవరు అలాంటి పాత్ర చేయలేరేమో అనిపించే రోల్ లో మెప్పించింది. ఈ పాత్ర సినిమాకి ప్రాణం అయ్యింది. ఆమె చుట్టూనే కథ కూడా తురుగుతూ ఉంటుంది.

థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాతో పాయల్ సక్సెస్ అయితే అందుకుంది. కాని నటిగా మరల తనకి కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం రాలేదు. స్టార్ హీరోలతో జత కట్టే ఛాన్స్ లు తీసుకొచ్చే అవకాశం లేనట్లయ్యింది. కనీసం మీడియం రేంజ్ హీరోలైన అవకాశాలు ఇస్తారేమో అని వెయిట్ చేస్తోంది. మంగళవారం కచ్చితంగా తనని కమర్షియల్ హీరోయిన్ చేస్తుందని ఆశించింది.

అయితే మూవీ రిలీజ్ తర్వాత పరిస్థితి ఇంకోదారిలో పాయల్ ని నడిపిస్తోంది. ఆమెకి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. వాటిలో చాలా వరకు ఫిమేల్ సెంట్రిక్ కథలే అంట. అలాగే బోల్డ్ క్యారెక్టరైజేషన్ తో నడిచే స్టొరీలే అని తెలుస్తోంది. వీటిలో బెస్ట్ స్టోరీస్ ఇప్పుడు ఎంపిక చేసుకొని ఆమె కెరియర్ ని బిల్డ్ చేసుకునే పనిలో పాయల్ పడిందని టాక్.

Tags:    
  • Payalrajput 
  • Mangalavaram 
  • Ajaybhupathi 
  • Venkimama 
  • Discoraja 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS