• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బలగం వేణుతో సినిమా.. నాని...

బలగం వేణుతో సినిమా.. నాని ఏమన్నాడంటే?

| కథా చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణమని వార్తలు వచ్చాయి.

By - Tupaki Desk
Update: 2024-08-21 16:54 GMT

బలగం మూవీతో అందరినీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు వేణు. జబర్దస్త్ స్కిట్లతో పాపులర్ అయి.. కమెడియన్‌గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ సాగిన వేణు దర్శకుడు అవుతున్నాడంటేనే చాలామంది ఆశ్చర్యపోయారు. అలాంటిది అతను ‘బలగం’ లాంటి క్లాసిక్ మూవీ తీసి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం పెద్ద షాక్. తన రెండో చిత్రాన్ని వేణు.. నేచురల్ స్టార్ నానితో తీస్తాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు ‘యల్లమ్మ’ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. దిల్ రాజు సైతం ఓ సందర్భంలో ఈ సినిమాను కన్ఫమ్ చేశాడు. తీరా చూస్తే ఆ సినిమా ముందుకు కదల్లేదు. కథా చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణమని వార్తలు వచ్చాయి. కానీ వాస్తవంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.

ఐతే తన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజుతో కలిసి ప్రశ్నలు-సమాధానాల కార్యక్రమంలో పాల్గొన్న నానికి వేణు సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. ‘‘నేనొకసారి దిల్ రాజు గారిని కలిసినపుడు.. ఎలాంటి దర్శకులతో పని చేయాలనుకుంటున్నారు అని అడిగారు. దానికి బదులుగా వేణు మంచి దర్శకుడని.. బలగం బాగా తీశాడని.. అలాంటి వారితో పని చేయాలనుందని చెప్పాను. అప్పుడు మేం సరదాగా మాట్లాడుకున్నాం. కొన్ని రోజులకు అది వార్త రూపంలో బయటికి వచ్చింది. మా కాంబినేషన్లో కచ్చితంగా సినిమా ఉంటుంది. కానీ అది ఎప్పుడు అన్నది చెప్పలేను’’ అన్నాడు నాని. ఈ మాటల్ని బట్టి చూస్తుంటే దిల్ రాజు ద్వారానే మీడియాకు న్యూస్ లీకైనట్లు కనిపిస్తోంది. కానీ కథ ఓకే కాకపోవడం వల్ల సినిమా సాధ్యం కాకపోయి ఉండొచ్చు. ఇదిలా ఉండగా ప్రభాస్ మీద అర్షద్ వార్సి ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి అడగ్గా.. ‘‘మీరు చెబుతున్న వ్యక్తికి జీవితంలో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఇప్పుడే వచ్చి ఉంటుంది’’ అని నాని అన్నాడు. అల్లు అర్జున్ మూవీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కథతో ‘సరిపోదా శనివారం’ స్టోరీకి పోలిక గురించి అడిగితే.. సినిమా చూసి ఆ విషయం చెప్పమన్నాడు నేచురల్ స్టార్.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • SaripodhaaSanivaaram 
  • Nani 
  • Dilraju 
  • Balagam 
  • Venu 
  • Yellamma 

Similar News

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

Copyright @2026

Powered by Blink CMS