• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కన్నడ డైరెక్టర్.....

కన్నడ డైరెక్టర్.. టాలీవుడ్ + కోలీవుడ్ కాంబో!

| వీటి తర్వాత ప్రభాస్, రామ్ చరణ్ లైన్ అప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-11-26 04:17 GMT

'ఉగ్రం', 'కేజీఎఫ్' సిరీస్ లతో శాండిల్ వుడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. అతని నాలుగో సినిమాని టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్, రామ్ చరణ్ లైన్ అప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ బాటలోనే మరో శాండిల్ వుడ్ డైరెక్టర్ నార్తన్ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. 'మఫ్తీ, 'భారతి రంగల్' సినిమాలతో శాండిల్ వుడ్ లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని నార్తన్ సొంతం చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు శివరాజ్ కుమార్ తోనే చేసాడు.

రీసెంట్ గా 'భారతి రంగల్' మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ దర్శకుడి మూడో సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ఇచ్చాడు. తన మూడో సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్స్ లోనే చేయబోతున్నట్లు తెలిపాడు. అలాగే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ని హీరోగా తీసుకోవాలని అనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అలాగే సూర్య పేరు కూడా పరిశీలనలో ఉందని అన్నారు.

వీరిద్దరిలో ఒకరిని కన్ఫర్మ్ చేస్తానని అన్నారు. అలాగే కన్నడ స్టార్ యాక్టర్ కూడా ఈ చిత్రంలో నటిస్తాడని చెప్పాడు. మొత్తం క్యాస్టింగ్ ఫైనల్ అయ్యాక అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తామని నార్తన్ స్పష్టం చేశాడు. నార్తన్, రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్టోరీ నేరేషన్ కూడా ఇక్కడని ప్రచారం జరిగింది.

తాజాగా నార్తన్ కూడా రామ్ చరణ్ తో మూవీ ఉంటుందని కన్ఫర్మ్ చేయడంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ పూర్తి చేయగా అది సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'RC 16' మూవీ రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. పీరియాడికల్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో 'RC 17' కూడా రామ్ చరణ్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. దాని తర్వాత నార్తన్ తో మూవీ చేస్తాడా లేదంటే ముందుగానే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Sandlewood 
  • Filmindustry 
  • Kgf 
  • Ugraam 
  • Rrr 
  • Mufti 
  • BharatiRangal 
  • RajkumarHirani 
  • Prashanthneel 
  • Gamechanger 
  • Ramcharan 
  • Ntr 
  • War2 
  • Narthan 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS