దీపిక ఇక డేట్ అయిపోయిన‌ హీరోలకే సూట‌బుల్

బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో 45 వ‌య‌సు యువ‌కుడైన ప్ర‌భాస్ తో న‌టించే అవ‌కాశం వ‌స్తే, కాలద‌న్నుకోవ‌డం అవివేక‌మ‌ని, రెండు సినిమాల రూపంలో ఏకంగా రూ.40 కోట్లు న‌ష్ట‌పోయింద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.;

Update: 2025-09-21 00:30 GMT

దీపిక ప‌దుకొనే బ్యాక్ టు బ్యాక్ బిగ్ బ్లోని ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ స‌ర‌స‌న వ‌రుస‌గా రెండు పాన్ ఇండియా సినిమాల్లో అవ‌కాశం వ‌స్తే, ఆ రెండిటినీ త‌న అవివేకంతో కోల్పోయింద‌ని చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఇండ‌స్ట్రీలో ట్రెండింగ్ డైరెక్ట‌ర్లుగా పాపుల‌రైన సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ ల‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశాన్ని కాల‌రాసుకుంది.

ఆ రెండు క్రేజీ ప్రాజెక్టుల నుంచి వైదొల‌గ‌డ‌మే గాక‌, తాను త‌న 18 ఏళ్ల కెరీర్ లో ఒకే హీరోతో ఆరు సార్లు క‌లిసి ప‌ని చేసాను! అంటూ చాలా అమాయ‌కంగా షారూఖ్ పేరును సూచించింది. ఖాన్ న‌టిస్తున్న కింగ్ సెట్స్ లో చేరిన‌ట్టు కూడా వెల్ల‌డించింది. `ఓం శాంతి ఓం`లో న‌టించిన‌ప్పుడు షారూఖ్ నేర్పించిన విద్య గురించి కూడా చాలా ఘ‌నంగా చెప్పుకొచ్చింది. త‌న వ్య‌క్తిగత సౌక‌ర్యానికి భంగం క‌లిగే విధంగా షూటింగుల‌కు హాజ‌రు కాలేన‌ని తెగేసి చెప్పింది.

అయితే దీనిపై చాలామంది కొంటె నెటిజ‌నులు టైమింగ్ లీ పంచ్ లు వేస్తున్నారు. కింగ్ ఖాన్ వ‌య‌సు కొన్ని దినాలు గడిస్తే 60కి చేరుకుంటుంది. ష‌ష్ఠిపూర్తికి చేరువ‌వుతారు. ఆయ‌న ఓల్డ్ స్కూల్ ని దీపిక ఫాలో అవుతోంద‌ని కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. జ‌మానా కాలంలో ఫార్ములాను ఇప్ప‌టి జెన్ జెడ్ ట్రెండ్ కి అప్ల‌య్ చేయాల‌నుకుంటే న‌ష్ట‌పోయేది దీపిక మాత్ర‌మేన‌ని కూడా సూచిస్తున్నారు. 60 ప్ల‌స్ ఖాన్ ల‌తో అవ‌కాశాల కోసం 40 ప్ల‌స్ యువ‌హీరోల‌తో అవ‌కాశాల్ని కాద‌నుకోవ‌డం స‌రికాద‌ని సూచిస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో 45 వ‌య‌సు యువ‌కుడైన ప్ర‌భాస్ తో న‌టించే అవ‌కాశం వ‌స్తే, కాలద‌న్నుకోవ‌డం అవివేక‌మ‌ని, రెండు సినిమాల రూపంలో ఏకంగా రూ.40 కోట్లు న‌ష్ట‌పోయింద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ న‌ష్టం ఇక్క‌డితో ఆగిపోదు.. రెండు భారీ చిత్రాల నుంచి తొల‌గించార‌నే అప‌ప్ర‌ద కార‌ణంగా, ఇత‌ర పెద్ద బ్యాన‌ర్లు కూడా అవ‌కాశాలిచ్చేందుకు వెన‌కాడితే ఆ న‌ష్టం 100 కోట్లు! అని కూడా విశ్లేషిస్తున్నారు. ప్ర‌భాస్ మ‌రోసారి దీపిక‌ను పిలిచి అవ‌కాశం ఇవ్వ‌గ‌ల‌డా? అనేది ఒక పెద్ద చిక్కు ప్ర‌శ్న‌. ఎవ‌రైనా న‌టి క‌న్ఫామ్ గా హిట్లు కొట్టే ద‌ర్శ‌కుల‌తో ట్రెండ్ లో ఉన్న హీరోతో క్రేజీ సినిమాల్లో న‌టించిన‌ప్పుడే బ్రాండ్ అండార్స్ మెంట్ల‌లోను దూసుకుపోగ‌ల‌దు. ఆ ర‌కంగా వాటికి కూడా గండి ప‌డిన‌ట్టేన‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. అస‌లే కెరీర్ బ్యాడ్ ఫేజ్ లో ఉన్న ఈ స‌మ‌యంలో దీపిక ఇలాంటి త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని కూడా సూచిస్తున్నారు.

Tags:    

Similar News