తార‌క్ స్పెష‌ల్ ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

టాలీవుడ్ లో చాలా కాలంగా ఓ క‌ల్చ‌ర్ ఉంది. స్టార్ హీరోల పుట్టిన రోజులు వ‌స్తే సినిమా అప్ డేట్లు అందించ‌డం లేదా?

Update: 2024-05-04 07:44 GMT

టాలీవుడ్ లో చాలా కాలంగా ఓ క‌ల్చ‌ర్ ఉంది. స్టార్ హీరోల పుట్టిన రోజులు వ‌స్తే సినిమా అప్ డేట్లు అందించ‌డం లేదా? కొత్త ప్రాజెక్ట్ వివ‌రాలు రివీల్ చేయడం వంటివి జ‌రుగుతుంటుంది. ఈ మ‌ధ్య కాలంలో బ‌ర్త్ డేల విష‌యంలో ఇది మ‌రింత ట్రెండింగ్ గానూ మారింది. సినిమా అప్ డేట్ లేనిదే హీరో బ‌ర్త్ డేకి కిక్ రావ‌డం లేదు. దీంతో అభిమా నుల్ని దృష్టిలో పెట్టుకుని ఏదో విష‌యం చెప్ప‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఈనేప‌థ్యంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే తేదీ కూడా ద‌గ్గ‌ర ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈనెల 20 న తార‌క్ బ‌ర్త్ డే. మ‌రి ఈ సంద‌ర్భంగా ఏవైనా అప్ డేట్స్ ఉంటాయా? అంటే `దేవ‌ర` నుంచి అయితే క‌చ్చితంగా ఏదో ఒక స‌ర్ ప్రైజ్ ఉండే ఛాన్స్ ఉంది. అక్టోబ‌ర్ లోనే ఆ సినిమా రిలీజ్ కి ఉంది కాబ‌ట్టి క‌చ్చితంగా అభిమానుల‌కు బ‌ర్త్ డే ట్రీట్ ఉంటుంది. అయితే ఇంత‌వ‌ర‌కూ దానికి సంబంధించి ఎలాటి హ‌డావుడి క‌నిపిం చ‌లేదు గానీ వారం రోజులు ముందుగా చిత్ర యూనిట్ నుంచి లీకులొచ్చే అవ‌కాశం ఉంది. మ‌రి బాలీవుడ్ డెడ్యూ `వార్ -2` నుంచి విష‌యం ఏదైనా ఉంటుందా? అన్న‌ది చూడాలి.

Read more!

తార‌క్ ఇటీవ‌లే `వార్ -2` షూట్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో తార‌క్ రోల్ పై ర క‌ర‌కాల ప్ర‌చారాలు సాగుతున్నాయి. దీంతో అత‌డి లుక్ ఎలా ఉంటుంది? అని అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనేప‌థ్యంలో బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ లాంటి ట్రీట్ ఏదైనా ఉంటుందా? అని ఆశిస్తున్నారు. కానీ బాలీవుడ్ నుంచి బ‌ర్త్ డే ట్రీటులు అనేవి చాలా రేర్. పుట్టిన రోజున నాడు అభిమానుల కోసం ఫస్ట్ లుక రిలీజ్ చేయ‌డం..టీజ‌ర్ రిలీజ్ వంటివి పెద్ద‌గా క‌నిపించ‌వు.

అక్కడ క‌ల్చ‌ర్ లో ఇది లేదు. కానీ టాలీవుడ్ లో ఉంది కాబ‌ట్టి తార‌క్ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ఫ‌స్ట్ లుక్ స‌ర్ ప్రైజ్ ఏదైనా ఉంటుందా? అన్న‌ది చూడాలి. అలాగే యంగ్ టైగ‌ర్ ఈసినిమా పూర్తి చేసిన వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా క‌మిట్ అయి ఉన్నారు. ఆ వివ‌రాలు కూడా ఆ రోజు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మ‌రికొంత మంది అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇది క‌ష్ట‌మైన ప‌నే. ప్ర‌శాంత్ నీల్ `స‌లార్ -2` ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. తార‌క్ సినిమా ప‌ట్టాలెక్కేది కూడా 2025 లో. అందుకు చాలా స‌మ‌యం ఉంది. కాబ‌ట్టి అప్ డేట్ ఉండక‌పోవ‌చ్చ‌ని మెజార్టీ వ‌ర్గం బావిస్తోంది.

Tags:    

Similar News