• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెల్ కం టు ది జంగిల్:...

వెల్ కం టు ది జంగిల్: క‌డుపు చెక్క‌లు ముక్క‌లు!

| అక్ష‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన తాజా వీడియో గ్లింప్స్ క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. ఇది ప‌ర్ఫెక్ట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన‌డంలో సందేహం లేదు.

By - Tupaki Desk
Update: 2023-09-09 16:07 GMT

బాలీవుడ్ లో వెల్ కం ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క‌డుపు చెక్క‌ల‌య్యే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అహ్మద్ ఖాన్ ఈసారి 'వెల్‌కం టు ది జంగిల్' అంటూ సీక్వెల్ సినిమాతో మ‌రోసారి మ్యాజిక్ ని రిపీట్ చేయ‌బోతున్నాడు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో వెల్ కమ్ టు ది జంగిల్ ఒక‌టి. ఈ మూవీ కోసం బాలీవుడ్‌లోని అగ్ర‌తార‌లంతా ఏకమయ్యారు. మొత్తం 24మంది అగ్ర తార‌లు వెల్‌కమ్ ఫ్రాంచైజీకి మ‌రింత వ‌న్నె తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈసారి ఫుల్ ప‌టాకా కామెడీతో జంగిల్ లో విహారానికి తార‌లంతా సిద్ధ‌మ‌వుతున్నారు.

అక్ష‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన తాజా వీడియో గ్లింప్స్ క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. ఇది ప‌ర్ఫెక్ట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన‌డంలో సందేహం లేదు. అకాపెల్లా.. -మ్యూజిక్ వీడియోలో 24 మంది నటీనటులు ఒకే చోట బోలెడంత ప‌సందైన కామెడీతో అల‌రించారు. మీట్ బ్రదర్స్ ఆర్కెస్ట్రేటెడ్ గ్రూప్ గా క‌నిపించారు. మేకర్స్ షేర్ చేసిన ప్రత్యేక అకాపెల్లా వీడియోలో తారాగణం స‌హా సాంకేతిక బృందం ఎంతో ఉత్సాహంగా క‌నిపించారు. అద్భుతమైన‌ కామిక్ టైమింగ్‌తో అల‌రించే ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ టీమ్‌కి నాయకత్వం వహించారు. సంజయ్ దత్, సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ, పరేష్ రావల్, జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కృష్ణ అభిషేక్, కికు శారదా, దలేర్ మెహందీ, మికా సింగ్, రాహుల్ దేవ్, ముకేష్, రాహుల్ దేవ్, తివారీ, షరీబ్ హష్మీ, ఇనాముల్హాక్, జాకీర్ హుస్సేన్, యశ్పాల్ శర్మ వంటి ప్రతిభావంతులైన తార‌ల‌ బృందం ఖిలాడీతో చేరి బోలెడంత ర‌చ్చ చేస్తోంది. రవీనా టాండన్, లారా దత్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ ఈ వీడియోకి ప్ర‌త్యేక‌ ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా దిశా ప‌టానీ, జాకీల గ్లామ‌ర్ కంటెంట్ యూత్ కి ఫుల్ కిక్కిస్తుంద‌ని తాజా గ్లింప్స్‌ వెల్ల‌డిస్తోంది.

వెల్‌కం టు ది జంగిల్ అనేది 'వెల్‌కం' ఫ్రాంచైజీలో మూడ‌వ సినిమా. కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది సినిమా విప్లవం! ఈ ఫ్రాంచైజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను అందించడంతో పాటు స‌కుటుంబ స‌మేతంగా ఇంటిల్లిపాదీ ఓచోట చేరి నవ్వులు పంచుకునేలా చేసే ఫ్రాంఛైజీ చిత్ర‌మిది. సినిమాలో చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకాలను అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 6 సంవ‌త్స‌రాల పిల్లల నుండి 60 ఏళ్ల‌ తాతయ్యల వరకు విభిన్న వ‌య‌సుల‌ ప్రేక్షకుల కోసం రూపొందుతున్న ప్ర‌త్యేక‌మైన సిరీస్ అన‌డంలో సందేహం లేదు.

జియో స్టూడియోస్ - బేస్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంయుక్త‌ సమర్పణలో జ్యోతి దేశ్‌పాండే - ఫిరోజ్ ఎ. నడియాద్‌వాల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ ద‌శ‌లో ఉంది. 20 డిసెంబర్ 2024న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమ‌వుతోంది. వెల్‌కమ్ ఫ్రాంచైజీలో మ‌రిన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను కొనసాగించే ఉత్సాహంతో మేకర్స్ భారీ పెట్టుబ‌డుల్ని స‌మ‌కూరుస్తున్నార‌ని స‌మాచారం.

Full View
Tags:    
  • Bollywood 
  • Welcome 
  • Welcoemmovie 
  • Welcometothejungle 
  • Welcometothejunglemovie 
  • Announcement 
  • Jiostudios 
  • Officialannouncement 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS