ఈ వీకెండ్ హాలీవుడ్ సినిమాలదే.. టాప్ లో ఆ మూడు

ఈ సినిమాలతో పాటు గత వారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.;

Update: 2025-07-14 07:19 GMT

ఇటీవల కుబేర, కన్నప్ప, సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలు ప్రస్తుతం థియేటర్ రన్ ముగించుకొని ఓటీటీ బాట పట్టాయి. ఈ ఇందులో పలు సినిమాలు ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా ది 100, ఓ బహమా అయ్యో రామా, వర్జిన్ బాయ్స్ వంటి కొత్త చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు.

ఈ సినిమాలతో పాటు గత వారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మనోళ్ల దృష్టి హాలీవుడ్ సినిమాలపై మళ్లింది. దీంతో ఈ వీకెండ్ ను హాలీవుడ్ సినిమాలు బాగా ఉపయోగించుకున్నాయి. ఆ సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఆ సినిమాలు డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి.

ఈ లిస్ట్ లో జురాసిక్ వరల్డ్ రీ బర్త్ టాప్ లో ఉంది. డైనోసార్ ల డీఎన్ఏ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ వీకెండ్ హౌస్ ఫుల్ షోలతో నిండిపోయింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కంది. మరో హాలీవుడ్ సినిమా F1కు కూడా మంచి స్పందన వస్తోంది. లిమిటెడ్ స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ వసూళ్లు సాధిస్తుంది.

ఇక ఈ వీకెండ్ లో రిలీజైన సూపర్ హీరో మూవీ సూపర్ మ్యాన్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వస్తున్నాయి. చిన్నా పెద్దా అన్ని వర్గాల ప్రేక్షకులను సూపర్ మ్యాన్ అలరిస్తుంది. ఇలా ఈ మూడు హాలీవుడ్ సినిమాలు ఈ వీకెండ్ లో భారత్లోని పలు నగరాల్లో టాప్ ఛాయిస్ గా స్కీనింగ్ అవుతున్నాయి.

మరోవైపు, ఇండియన్ సినిమాల్లో ఆమిర్ ఖాన్ సితారే జమీన్ ఫర్ చిత్రం మంచి పర్ఫామెన్సే ఇచ్చింది. ఇది హిందీ బెల్ట్ లో డీసెంట్ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం నాలుగో వారంలో మొత్తం మీద మంచి కలెక్షన్లు అందుకుంది. ఇది మొత్తం మీద ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ వీకెండ్ లో మన సినిమాల కంటే హాలీవుడ్ చిత్రాలు మంచి ప్రదర్శన చేశాయి.

Tags:    

Similar News