ఎన్టీఆర్‌, హృతిక్‌ 'వార్‌ 2' లీక్‌ న్యూస్‌ వైరల్‌

ఎన్టీఆర్‌ ను సూపర్‌ 30 లుక్‌ లో చూడబోతున్నామని, అలాగే ఎన్టీఆర్‌ ను మాస్ అండ్ స్టైలిష్ లుక్ లో వార్‌ 2 లో చూడబోతున్నామని యూనిట్‌ సభ్యుల ద్వారా లీక్‌ అందుతోంది.

Update: 2024-04-28 05:46 GMT

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'వార్‌ 2'. ఈ సినిమా పై హిందీ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నాడు.

ఇటీవలే దేవర సినిమా షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చి మరీ వార్ 2 షూటింగ్‌ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్‌ మొదటి షెడ్యూల్‌ లో పాల్గొంటున్నాడు. షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత హీరోల లుక్స్ గురించిన వార్తలు సోషల్‌ మీడియా ద్వారా లీక్ అయ్యాయి.

ఎన్టీఆర్‌ ను సూపర్‌ 30 లుక్‌ లో చూడబోతున్నామని, అలాగే ఎన్టీఆర్‌ ను మాస్ అండ్ స్టైలిష్ లుక్ లో వార్‌ 2 లో చూడబోతున్నామని యూనిట్‌ సభ్యుల ద్వారా లీక్‌ అందుతోంది. వీరిద్దరి కాంబో సన్నివేశాలు వచ్చిన ప్రతి సారి ప్రేక్షకులు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవ్వడం ఖాయం అంటున్నారు.

హృతిక్‌ రోషన్ గతంలో నటించిన వార్‌ సినిమా భారీ కమర్షియల్‌ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటుందని, ఎన్టీఆర్‌ ఉండటం వల్ల సౌత్‌ లో ఈ సినిమా మరింతగా ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్‌ వినిపిస్తుంది.

Read more!

ఎన్టీఆర్‌ వార్‌ 2 తాజా షెడ్యూల్‌ పూర్తి చేసిన వెంటనే దేవర సినిమా షూటింగ్‌ కి రీ జాయిన్‌ అవ్వబోతున్నాడు. ఇప్పటికే దేవర సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యింది. అక్టోబర్‌ లో విడుదల అవ్వబోతున్న దేవర కి సంబంధించిన షూటింగ్‌ వర్క్ ను జూన్‌ వరకు పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్ అలీ ఖాన్‌ దేవర సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక బాలీవుడ్‌ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతుంది.

Tags:    

Similar News