మినిమం 500 కోట్ల క్లబ్ ఛాన్సుందా?
ఇది బాషా రేంజులో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ఇందులో కూలీగా నటిస్తున్న రజనీ నేపథ్యం ఉత్కంఠ పెంచుతుందని కూడా గుసగుస వినిపిస్తోంది.;
2025 ప్రథమార్థం నెలరోజుల్లో ముగుస్తుంది. జూలై నుంచి ద్వితీయార్థం ప్రారంభం సినీపరిశ్రమకు ఎలా ఉండబోతోంది? అంటే భారతీయ సినీపరిశ్రమలో పలు క్రేజీ చిత్రాలు విడుదలకు రానున్నాయి. వీటిలో హృతిక్- తారక్ నటించిన వార్ 2 ఆగస్టులో విడుదల కానుండగా, అదే సీజన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ ల డెడ్లీ కాంబినేషన్ కూలీతో బరిలో దిగుతోంది. ఇది బాషా రేంజులో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ఇందులో కూలీగా నటిస్తున్న రజనీ నేపథ్యం ఉత్కంఠ పెంచుతుందని కూడా గుసగుస వినిపిస్తోంది.
వార్ 2- ఆగస్టులో వస్తుండగా, ఈ చిత్రానికి పోటీగా `కూలీ` రావడం బాక్సాఫీస్ వద్ద సంఖ్యలను తగ్గిస్తుంది. ఈ రెండు భారీ సినిమాల నడుమ క్లాష్ ఏర్పడుతుందని అంచనా. అయితే ఈ రెండు సినిమాలు స్టార్ పవర్ దృష్ట్యా దర్శకుడు, బ్యానర్ దృష్ట్యా 500 కోట్ల క్లబ్ లో మినిమం అడుగుపెడతాయని అంచనా వేస్తున్నారు. బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తే 500-1000 కోట్ల మధ్య వసూళ్లు దక్కే వీలుంటుందని భావిస్తున్నారు. అయితే ప్రజలకు థియేటర్లకు రావడానికి అవసరమైన అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే ఇది పాజిబుల్.
తదుపరి ప్రభాస్ `ది రాజా సాబ్` విడుదలకు వస్తుంది. మారుతి ఈ సినిమాని పూర్తి చేసేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. దానికి తగ్గట్టే విజువల్స్ పరంగా స్టన్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే కన్నడ నటుడు రిషబ్ శెట్టి `కాంతార ప్రీక్వెల్`ని అక్టబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య బాబు అఖండ 2 కూడా సూపర్ ఫోర్స్ తో దూసుకొస్తోంది. బాలయ్య బాబు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.