తమ హీరో డైలాగ్ వాడారంటూ ఫ్యాన్స్ ఫైర్
అంతటి భారీ హైప్ ఉన్న సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. రీసెంట్ గా వార్2 ట్రైలర్ రాగా ఆ ట్రైలర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురిచేసింది.;
ఈ ఇయర్ మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా వస్తోన్న సినిమాల్లో వార్2 కూడా ఒకటి. హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఎన్నో అంచనాలతో వస్తున్న సినిమా కావడంతో వార్2 విషయంలో ప్రతీదీ పర్ఫెక్ట్ గా ఉండాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.
వివాదంలో వార్2
హృతిక్, ఎన్టీఆర్ గొప్ప నటులవడం, సినిమాలో వీరిద్దరి మధ్య పెద్ద డ్యాన్స్ నెంబర్ ఉందని చెప్పడం దానికి తోడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ వార్ కు సీక్వెల్ గా వస్తుండటంతో వార్2 పై నెక్ట్స్ లెవెల్ హైప్ ఉంది. అంతటి భారీ హైప్ ఉన్న సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. రీసెంట్ గా వార్2 ట్రైలర్ రాగా ఆ ట్రైలర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురిచేసింది.
సల్మాన్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత
వార్2 ట్రైలర్ లో యా తో మారుంగా, యా మారుంగా అనే డైలాగ్ పెట్టడాన్ని సల్మాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే డైలాగ్ ను 2009లో సల్మాన్ ఖాన్ వాంటెడ్ అనే సినిమాలో వాడారు. ఇప్పుడు అదే లైన్ ను యష్ రాజ్ ఫిల్మ్స్ వార్2 కోసం వాడటంతో యష్ రాష్ ఫిల్మ్స్ తమ హీరో డైలాగ్ ను కాపీ చేశారని విమర్శిస్తున్నారు.
భారీ సినిమాలు చేసేటప్పుడు మినిమం ఆలోచించకపోతే ఎలా అని కొందరంటుంటే, సరైన డైలాగులు రాసే రైటర్లు లేరా, చిత్ర యూనిట్ అంత సోమరితనంగా ఉన్నారా అని కామెంట్ చేస్తున్నారు. మంచి కథతో పాటూ, ఎంతో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న వార్ లాంటి ఫ్రాంచైజ్ నుంచి సహజంగా ఇలాంటివి ఎవరూ ఊహించరు. ట్రైలర్ రిలీజయ్యాక అందులో ఫ్రెష్‌నెస్ లేదంటూ వచ్చిన ఆందోళనలకు ఈ వివాదం మరింత ఆజ్యం పోస్తుంది.
నమ్మకంతో చిత్ర యూనిట్
ట్రైలర్ లో విజువల్స్ గ్రాండ్ గా ఉన్నప్పటికీ, స్పై థ్రిల్లర్ ఫార్ములాను ఎక్కువగా వాడారని, కథంతా ఊహించినట్టే ఉందని అందరూ అంటున్నారు. ఇవన్నీ వార్2 హైప్ ను తగ్గించే ఛాన్సులున్నాయి. ఇవన్నీ చూశాక కూడా ఆడియన్స్ మాత్రం వార్2 నుంచి కొత్తదనాన్ని, ఎమోషనల్ కంటెంట్ ను ఆశిస్తున్నారు. అయితే సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు జరుగుతున్నా చిత్ర నిర్మాతలు మాత్రం స్టార్ క్యాస్టింగ్ మరియు స్టోరీ లైన్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో భాగమవడంతో సౌత్ లో వార్2 కు మంచి క్రేజ్ ఏర్పడింది.