బాక్సాఫీస్‌పై వీరిది స్పెషల్ వార్

కంటెంట్, స్కేల్, మార్కెట్ అన్ని విషయంలోనూ రెండు సినిమాలూ పక్కా బిగ్ స్క్రీన్ ఫైట్ కి సిద్ధంగా ఉన్నాయి. కానీ, ప్రేక్షకుల్లో ఇప్పుడు మ్యూజిక్ పై చర్చ మొదలైంది.;

Update: 2025-07-30 09:44 GMT

ఈ ఏడాది ఆగస్ట్ 14 టాలీవుడ్ బాలీవుడ్ బాక్సాఫీస్‌కు పండగే. ఒకవైపు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ యాక్షన్ సినిమా ‘వార్ 2’ మరోవైపు రజనీకాంత్, నాగార్జున, అమిర్ ఖాన్, శృతి హాసన్ వంటి స్టార్ క్యాస్ట్‌తో సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలి’. ఈ రెండు సినిమాల మధ్య పోటీపై ఇప్పటికే ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ అయింది. కంటెంట్, స్కేల్, మార్కెట్ అన్ని విషయంలోనూ రెండు సినిమాలూ పక్కా బిగ్ స్క్రీన్ ఫైట్ కి సిద్ధంగా ఉన్నాయి. కానీ, ప్రేక్షకుల్లో ఇప్పుడు మ్యూజిక్ పై చర్చ మొదలైంది.

అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్

కూలికి సంగీతం అందిస్తున్న అనిరుధ్ తనదైన స్టైల్‌తో ఇప్పటికే పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాడు. మౌనికా మౌనికా, పవర్ హౌస్ వంటి పాటలు యూత్‌ని పిచ్చెక్కించాయి. ట్రెండ్ మేకర్‌గా పేరు సంపాదించుకున్న అనిరుధ్, మాస్ తో క్లాస్ కాంబినేషన్‌ని మళ్ళీ నిరూపించాడు. పాటలు మాత్రమే కాదు, బీజీఎమ్ లోనూ ఇంటెన్సిటీ పెంచుతూ ప్రేక్షకులను థియేటర్‌లో ఎమోషన్‌కు గురి చేసే స్కోర్ ఇచ్చాడు. అందుకే కూలికి మొదటి పాట నుంచి హైప్ పెరిగిపోతుంది.

వార్ 2లో ప్రీతమ్

ఇదే సమయంలో, వార్ 2లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రీతమ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ‘ధూమ్’తో నార్త్ ఇండియా మొత్తం ఊపేసిన ప్రీతమ్, ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘అవాన్ జవాన్’తో మళ్లీ ట్రెండ్ సెట్ చేయాలని చూస్తున్నాడు. నిజానికి, గత కొంతకాలంగా ప్రీతమ్ ఆల్బమ్‌లు అంతగా దుమ్ము లేపలేదు. కొన్ని పాటలు మాత్రమే పాపులర్ అయ్యాయి కానీ, ఓ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వడం కొన్నేళ్లుగా జరగలేదు. ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ వరల్డ్ క్లీన్ మార్కెట్ కోసం, తెలుగు, హిందీ రెండు సైడ్స్‌ని టార్గెట్ చేస్తూ పాటలు కంపోజ్ చేసినట్టు సమాచారం.

ఫ్యాన్స్ అంచనాలు, మ్యూజిక్ ట్రెండ్ డిస్కషన్

ఇప్పుడు ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్ అందరి మ్యూజికల్ క్లాష్‌పైనే ఉంది. అనిరుధ్ మ్యాజిక్, యువతలో ఎప్పుడూ ఫస్ట్‌ ప్లేస్‌లోనే ఉంటుంది. కానీ, ప్రీతమ్ దగ్గర ‘ధూమ్’ బీజీఎమ్, హై రేంజ్ ట్రాక్‌ల అనుభవం ఉంది. ఈసారి మళ్ళీ అలాంటి మ్యూజిక్ ఇవ్వగలడా? స్పీడ్, స్టైల్ విషయంలో ప్రీతమ్ తన మార్క్ చూపించాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా తెలుగు వెర్షన్‌పై దృష్టిపెట్టారు. వార్ 2 ఆల్బమ్ పూర్తి స్థాయిలో క్లిక్ అయితే, ప్రీతమ్‌కు టాలీవుడ్‌లో మళ్ళీ మంచి క్రేజ్ వస్తుంది.

మ్యూజిక్ రేసులో ఎవరిది పైచేయి?

ఈసారి పాటల పోటీ వేరు. ఒకరికి యూత్ రెస్పాన్స్, మరొకరికి మాస్-క్లాస్ కలయిక. అనిరుధ్ వర్క్ అంతర్జాతీయ ప్రమాణాలు తాకితే, ప్రీతమ్ ‘వార్’ లెవెల్లో స్పై థ్రిల్, మాస్ మ్యూజిక్ మిక్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. మ్యూజిక్ రివ్యూలు, ఫ్యాన్స్ స్పందన చూసి ఎవరు గెలుస్తారు అనేది తేలుతుంది. వార్ 2-కూలి మ్యూజికల్ క్లాష్ ఇండియన్ సినిమా మ్యూజిక్ స్టాండర్డ్స్‌ను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లే అవకాశముంది. ఇక ఎవరి హవా నెగ్గుతుందో అతి త్వరలోనే తెలుస్తుంది.

Tags:    

Similar News