• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వార్‌ 2' రొటీన్ మూవీ...

'వార్‌ 2' రొటీన్ మూవీ కాదు.. ఎందుకంటే!

| హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ముఖ్య పాత్రల్లో నటించిన 'వార్‌ 2' సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By - Tupaki Desk
Update: 2025-05-20 07:06 GMT

హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ముఖ్య పాత్రల్లో నటించిన 'వార్‌ 2' సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వార్‌ 2 ఉండబోతుందని తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే అనిపిస్తోంది. నిజంగా వార్‌ను కళ్ల ముందుకు తీసుకు వచ్చే విధంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమాను రూపొందించినట్లు విజువల్స్ ఉన్నాయి. ముఖ్యంగా హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ల మధ్య ఉండే ఫైట్‌ మరో లెవల్‌ అన్నట్లుగా ఉంటుందని అనిపిస్తోంది. ఆ ఫైట్‌కి సంబంధించిన విజువల్స్ ఎక్కువగా టీజర్‌లో లేవు అయినా కూడా చూపు తిప్పనివ్వకుండా ఆ యాక్షన్‌ సీన్‌ ఉంటుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'వార్‌ 2' సినిమా రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మట్‌లో ఉండదట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని, అందులో ఒకటి హృతిక్‌ రోషన్‌, కియారా అద్వానీ కాంబోలో సాగే రొమాంటిక్ నెంబర్‌ కాగా, రెండోది హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కాంబోలో ఉండే పార్టీ సాంగ్‌. ఈ రెండు పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా రొటీన్‌ కమర్షియల్‌ సినిమాల్లో ఐదు, ఆరు పాటలు ఉంటాయి, నాలుగు ఫైట్లు ఉంటాయి. కానీ ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని తెలిసి పోయింది. అయితే యాక్షన్‌ సన్నివేశాలు మాత్రం ఎక్కువ ఉంటాయట.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'వార్ 2' సినిమాలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ఉంటాయట. ఒకటి భారీ ఛేజింగ్‌ సీన్ ఉంటుందట. మొత్తంగా ఆరు యాక్షన్‌ సీన్స్‌తో వార్‌ 2 సినిమా ఫుల్‌ ఆఫ్ యాక్షన్ మూవీగా ఉంటుందని మేకర్స్‌ నుంచి సమాచారం అందుతోంది. ఈమధ్య కాలంలో యాక్షన్‌ సినిమాలకు, ముఖ్యంగా సౌత్‌ హీరోలు నటించిన యాక్షన్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో వార్ 2 సినిమా గురించి కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్ పై హైప్ పెంచే విధంగా ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతోంది.

వార్‌ 2 సినిమాతో పాటు ఎన్టీఆర్‌ కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వార్‌ 2 సినిమా ఈ ఏడాదిలో విడుదల కానుండగా ఎన్టీఆర్‌ నటిస్తున్న ప్రశాంత్‌ నీల్‌ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల ఉండే అవకాశం ఉంది. నేడు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా వార్‌ 2 నుంచి టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. ఇక ప్రశాంత్‌ నీల్‌ ఒక పోస్టర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున వసూళ్లు సొంతం చేసుకోవడంతో పాటు, స్టార్‌డం దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Full View
Tags:    
  • War2 
  • HrithikRoshan 
  • NTR 
  • PanIndia 
  • ActionMovie 
  • BollywoodTollywood 
  • AyanMukherjee 
  • NTRBirthday 
  • PrashanthNeel 
  • NeelMovie 
  • TollywoodStars 
  • SouthCinema 
  • MovieBuzz 
  • FilmUpdate 

Similar News

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

Copyright @2026

Powered by Blink CMS