వార్ 2 ఎండ్ కార్డ్ లో సర్ ప్రైజ్.. థ్రిల్ పక్కా!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, హృతిత్ రోషన్ కాంబోలో తెరకెక్కిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఫిల్మ్ వార్ 2 కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, హృతిత్ రోషన్ కాంబోలో తెరకెక్కిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఫిల్మ్ వార్ 2 కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందింది. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎన్టీఆర్, హృతిక్ లాంటి బడా స్టార్లు ఇందులో నటించడంతో ఈ సినిమా పై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది.
గత మే నెలలో తారక్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్ వదిలారు. ఇప్పుడు జూలై 26న ట్రైలర్ విడుదల చేయనున్నారు. అయితే టీజర్ లో భారీ యాక్షన్ సీన్స్, ఇద్దరు స్టార్ మధ్య ఫైట్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ సినిమాలో స్టంట్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఫిదా చేస్తాయట.
అలాగే ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అయ్యే అంశాలు కూడా మరెన్నో ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ మరో సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారట. వార్ 2 సినిమా ఎండ్ కార్డ్ పడిన తర్వాత.. శార్వరీ వాఘ్, ఆలియా భట్ కలిసి నటిస్తున్న ఆల్ఫా సినిమాకు సంబంధించిన ఓ సీక్వెన్స్ స్క్రీన్ పై ప్లే చేయనున్నారని బీ టౌన్ లో వార్తలు వస్తున్నాయి. ఇది ప్రేక్షకులను థ్రిల్ చేయడం పక్కా సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అయితే మొదట్నుంచి ఈ సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ ఉంటుందని అన్నారు. లేదంటే ఎండ్ కార్డ్ టైటిల్ తర్వాత షారుక్ సినిమా సీక్వెన్స్ ఉంటుందని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఆల్ఫా ప్రచారంలోకి వచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్ స్పై యాక్షన్ సినిమానే ఆల్ఫా. అయితే వార్ 2 సినిమా తర్వాత ఈ చిత్రం సీక్వెన్స్ ప్లే చేస్తే, థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియెన్స్ వార్ 2 తోపాటు ఆల్ఫా గురించి కూడా మాట్లాడుకుంటారు.
అలా యశ్ రాజ్ ఫిల్మ్ సంస్థ నుంచి వార్ 2 తర్వాత ఆల్ఫానే రానుందని హింట్ ఇచ్చేందుకే మేకర్స్ ఇలా ప్లాన్ చేశారని టాక్. ఈ సినిమాలో ఆలియా, శార్వరీ రెండు వేర్వేరు బ్యాగ్రౌండ్స్ కు చెందిన ఇద్దరు యువతుల స్పే ఏజెంట్ సినిమాలాగా ఇది తెరక్కుతోంది. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.