'పెద్ది'తో ఎంట్రీ.. బిజినెస్ లో పట్టు దొరికినట్లేనా..

టాలీవుడ్‌లో కొత్త ప్రొడక్షన్ హౌస్‌లు పుట్టుకురావడం, చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టడం కామన్. కానీ, "వృధ్ధి సినిమాస్" ఎంట్రీ మాత్రం అలా లేదు.;

Update: 2025-11-13 04:32 GMT

టాలీవుడ్‌లో కొత్త ప్రొడక్షన్ హౌస్‌లు పుట్టుకురావడం, చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టడం కామన్. కానీ, "వృధ్ధి సినిమాస్" ఎంట్రీ మాత్రం అలా లేదు. ఇది ఒక డెబ్యూలా లేదు, ఇండస్ట్రీ రూల్స్ తెలిసిన పక్కా బిజినెస్ మైండ్ ఉన్నవాళ్లు వేసిన 'గేమ్ ఛేంజింగ్' స్కెచ్‌లా ఉంది. కొత్త బ్యానర్‌గా మొదటి అడుగులోనే బిగ్ కాంబినేషన్స్ ను మిక్స్ చేయడం చాలా స్పెషల్.

ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు, మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్. రెహమాన్ లాంటి పాన్ వరల్డ్ కాంబోతో వస్తున్నారు. ఒక సినిమా బిజినెస్‌లో ప్రమోషన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ విషయంలో 'వృధ్ధి సినిమాస్' మార్కెటింగ్‌ను ఒక కేస్ స్టడీలా చూడాలి. సినిమా రిలీజ్‌కు (మార్చి 2026) ఇంకా చాలా నెలలు టైమ్ ఉండగానే, ఏకంగా ఐదు నెలల ముందే ఫస్ట్ సింగిల్ "చికిరి చికిరి"ని వదిలారు. ఇది వాళ్లు వేసిన "మాస్టర్‌స్ట్రోక్".

ఇది కేవలం పాటను రిలీజ్ చేయడం కాదు, తమ 'ప్రొడక్ట్ క్వాలిటీ'కి ఇది శాంపిల్ అంటూ డిస్ట్రిబ్యూటర్లకు, ఆడియన్స్‌కు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టు ఉంది. ఆ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్ అవ్వడమే కాదు, 13 దేశాల్లో ట్రెండ్ అవుతూ "వరల్డ్‌వైడ్ సెన్సేషన్" అయ్యింది. ఈ ఒక్క సాంగ్‌తోనే 'వృధ్ధి సినిమాస్' తమ బ్రాండ్ వాల్యూను పీక్స్‌లో సెట్ చేసింది. పాట కోసం గ్రీన్ మ్యాట్ సెట్లు వేసి గ్రాఫిక్స్ చేయలేదు.

క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా, కష్టమైనా సరే పక్కా 'రియల్ లొకేషన్ల'లో షూట్ చేశారు. ప్రతీ ఫ్రేమ్‌లో ఆ రిచ్‌నెస్, ఆ కొత్త విజువల్ టోన్ కనిపిస్తోంది. ఇది చూసిన బయ్యర్లు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సినిమాపై, ప్రొడక్షన్ హౌస్‌పై నమ్మకం కలుగుతుంది. ఇది వాళ్ల బిజినెస్ డీల్స్‌కు పెద్ద ప్లస్ పాయింట్.

మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, 'వృధ్ధి సినిమాస్' తమ నెక్స్ట్ మూవ్‌ను కూడా అనౌన్స్ చేసి మార్కెట్‌ను షేక్ చేసింది. వాళ్ల రెండో ప్రాజెక్ట్ ఏకంగా నటసింహం బాలకృష్ణతో NBK111 ఉండబోతోందని హింట్ ఇచ్చారు. ఇది వాళ్ల లాంగ్ టర్మ్ విజన్‌ను, స్టామినాను చూపిస్తుంది. చూస్తుంటే టాప్ బడా బ్యానర్ లలో ఒకటిగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక పాన్ ఇండియా నంబర్ల విషయానికొస్తే, 'వృధ్ధి సినిమాస్' టార్గెట్ రికార్డులే అని స్పష్టమవుతోంది. 'చికిరి చికిరి'కి వచ్చిన గ్లోబల్ రెస్పాన్స్ 'పెద్ది' సినిమాకు నాన్ థియేట్రికల్, థియేట్రికల్ బిజినెస్ రూపంలో రికార్డ్ నంబర్లను తెచ్చిపెట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్‌గా, 'వృధ్ధి సినిమాస్' ఒక కొత్త బ్యానర్‌లా కాకుండా, పక్కా ప్లానింగ్‌తో, బోల్డ్ ఐడియాలతో, గ్రాండ్ విజన్‌తో అడుగుపెట్టింది. వాళ్ల మొదటి అడుగే.. టాలీవుడ్ పాన్ ఇండియా లీగ్‌లో టాప్ స్పాట్ కోసం వేసినట్టుంది. చూడాలి మరి.. ఈ పెద్ది లెక్క ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో.

Tags:    

Similar News