ముద్దు సీన్ రిహార్సల్ చేద్దామని ఒత్తిడి తెచ్చాడు!
ప్రముఖ దర్శకుడు నన్ను ముద్దు ప్రాక్టీస్ చేయడానికి రిహార్సల్స్ కి రమ్మని అడిగాడు. ఒకవేళ అలా చేయకపోతే అవకాశం కోల్పోతావంటూ బెదిరించాడు.;
ప్రముఖ దర్శకుడు నన్ను ముద్దు ప్రాక్టీస్ చేయడానికి రిహార్సల్స్ కి రమ్మని అడిగాడు. ఒకవేళ అలా చేయకపోతే అవకాశం కోల్పోతావంటూ బెదిరించాడు. తాను అంగీకరించకపోయినా తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు అని ఆరోపించింది తమిళ నటి కం వీజే దీపిక. ప్రముఖ హీరో నటించే సినిమాలో నాయికగా ఎంపికయ్యానని అయితే రిహార్సల్స్ కి వస్తేనే అవకాశం కల్పిస్తానని సదరు దర్శకుడు ఒత్తిడి చేసినట్టు వెల్లడించారు.
వీజే దీపిక నటించిన `పాండియన్ స్టోరీస్` బుల్లితెరపై పెద్ద విజయం సాధించింది. నటిగా యూట్యూబర్ గా రాణించిన దీపిక ఈ సీరియల్ లో అద్భుతంగా నటించారు. తన నటనకు గొప్ప గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వెండితెర అవకాశాలు వెంటపడ్డాయి. కానీ ఇంతలోనే దర్శకుడితో తన అనుభవం గురించి ఓపెనైంది. అంతేకాదు ఈ చిత్రంలో ప్రముఖ హీరో కూడా నటించారని వీజే దీపిక వెల్లడించారు. తనను హీరో చెల్లెలి పాత్రకు ఎంపిక చేసిన సదరు దర్శకుడు తాను ముద్దు సీన్ రిహార్సల్స్ కి అంగీకరించకపోతే ఎవరో ఒకరిని ఎంపిక చేసుకుంటానని బెదిరించినట్టు తెలిపింది.
నటీమణులకు వేధింపుల సమస్య రెగ్యులర్ గా చూస్తున్నదే. మీటూ ఉద్యమం వేదికగా చాలా మంది తమకు ఎదురైన కఠోర అనుభవాలను వెల్లడించారు. కొందరు దర్శకులపై చర్యల కోసం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మీటూ లో ఎందరో దర్శకులు నిర్మాతలు నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలేవీ చాలామంది విషయంలో నిరూపించలేకపోవడంతో ఆ కేసులన్నీ వీగిపోయాయి.