నిశ్చితార్థం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఫోటోలు వైరల్!

ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ హీరో వివాహానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు.;

Update: 2026-04-05 20:04 GMT

2026వ సంవత్సరం తెలుగు సినిమా సెలబ్రిటీలకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.. అందులో భాగంగానే కొంతమంది తల్లిదండ్రులవుతుంటే మరికొంతమంది వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న వివాహం చేసుకోగా.. అటు అల్లు శిరీష్ కూడా తన ప్రేయసి నయనిక రెడ్డితో ఏడడుగులు వేశారు. అంతేకాదు బిగ్ బాస్ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన సొంతం చేసుకొని, అటు సినిమాలతో ఊహించని పాపులారిటీ అందుకున్న పునర్నవి భూపాలం కూడా ఇటీవల యూఎస్ఏ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకొని కొత్త బంధంలోకి అడుగు పెట్టింది.



 


ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ హీరో వివాహానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు వారసుడు ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కావ్య రెడ్డితో తన కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీల మధ్య గత నెలలో ప్రీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించి, తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. నేడు కుటుంబ సభ్యులు , అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు.



 


హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఇరువురు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ఇకపోతే నూతన కాబోయే జంట ఇద్దరు అందమైన దుస్తుల్లో మెరిసారు. పైగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తమ అభిమాన హీరో ఒక ఇంటివాడు కాబోతున్నారు అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈనెల 29వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆశీస్సులతో కుటుంబ సభ్యులు, అత్యంత సినీ సన్నిహితుల మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. బెల్లంకొండ సురేష్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అల్లుడు శీను సినిమాతో అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, సీత , రాక్షసుడు, అల్లుడు అదుర్స్, భైరవం వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. గత ఎడాది చివరిగా కిష్కింధపురి సినిమాతో పలకరించిన ఈయన ప్రస్తుతం మరో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు.

అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాబోయే భార్య కావ్య రెడ్డి విషయానికి వస్తే.. ఈమె హైదరాబాద్ కి చెందిన వారు. ఈమె తాత జడ్జి కాగా, ఈమె తండ్రి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇకపోతే పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని తెలుస్తోంది.

Tags:    

Similar News