టైమ్ తీసుకున్నా హిట్ ప‌క్కా! కంటెంట్ రిచ్ ప్రొడ్యూస‌ర్ గా SKN కొత్త బ్రాండ్

సినీ ఇండ‌స్ట్రీలో ఏటా వందలాది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కానీ అందులో బాక్సాఫీస్ వద్ద నిలబడి, భారీ లాభాలను తెచ్చిపెట్టే సినిమాల‌ సంఖ్య చాలా లిమిటెడ్.

Update: 2026-07-25 11:30 GMT

సినీ ఇండ‌స్ట్రీలో ఏటా వందలాది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కానీ అందులో బాక్సాఫీస్ వద్ద నిలబడి, భారీ లాభాలను తెచ్చిపెట్టే సినిమాల‌ సంఖ్య చాలా లిమిటెడ్. వేగంగా సినిమాలు తీసి రిలీజ్ చేయడం ఒక ఎత్తైతే, ఎంత టైమ్ తీసుకున్నా, తీసిన ప్రతి సినిమానూ బ్లాక్‌బస్టర్‌గా మలచడం మరొక ఎత్తు. సరిగ్గా ఈ రెండో పంథాలోనే పయనిస్తూ, టాలీవుడ్‌లో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్నారు నిర్మాత SKN.

తాజాగా రిలీజైన చెన్నై ల‌వ్ స్టోరీ సినిమా మూవీ మొద‌టి రోజే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 12.3 కోట్లు క‌లెక్ట్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. గతంలో ఎస్కేఎన్ బ్యాన‌ర్ లో వ‌చ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబీ సినిమా ఓపెనింగ్స్ కంటే ఇది 30% నుండి 40% ఎక్కువ కావడం విశేషం. హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ఈ సినిమా, ఆయనను బాక్సాఫీస్ వద్ద అత్యంత బ్యాంకబుల్ స్టార్‌గా ఎలివేట్ చేసింది. అయితే ఈ భారీ స‌క్సెస్ వెనుక ఆయ‌న చూపుతున్న నిల‌క‌డే ప్ర‌ధానంగా నిలుస్తోంది.

ప్రస్తుత పోటీ వాతావరణంలో ఏటా ఓ సినిమా రిలీజ్ చేయాలనే తొందరపాటు చాలా మంది నిర్మాతల్లో కనిపిస్తుంది. కానీ SKN శైలి ఇందుకు పూర్తిగా భిన్నం. 2018లో ట్యాక్సీవాలా, త‌ర్వాత ఐదేళ్ల‌కు 2023లో బేబీ, బేబీ త‌ర్వాత మూడేళ్ల‌కు తాజాగా చెన్నై ల‌వ్ స్టోరీ సినిమాల‌ను నిర్మించారు. ఏళ్ల తరబడి ప్రొడక్షన్ గ్యాప్ ఉన్నప్పటికీ, ఆయన నిర్మించిన‌ ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. రీసెంట్ గా ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్ లో తాను డ‌బ్బులున్న రిచ్ ప్రొడ్యూస‌ర్ ను కాద‌ని, తాను కంటెంట్ రిచ్ ప్రొడ్యూస‌ర్ ను అని సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు.

సినిమా సక్సెస్ కావడానికి కేవలం భారీ బడ్జెట్ మాత్రమే కొలమానం కాదని, సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ విజయాల పరంపర స్పష్టం చేస్తోంది. కొన్ని సార్లు టైమ్ ఎక్కువే పట్టవచ్చు, కానీ నమ్మిన కథపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు రూపాయి నష్టపోకుండా లాభాలు అందించడమే అసలైన స‌క్సెస్‌. ప్రొడక్షన్ గ్యాప్స్ ఉన్నా 100% సక్సెస్ రేట్‌ను కాపాడుకుంటూ వస్తున్న SKN ట్రాక్ రికార్డ్, లిమిటెడ్ బడ్జెట్‌తో నమ్మకమైన సినిమాలు తీయాలనుకునే కొత్త త‌రం నిర్మాతలకు ఒక గైడ్‌లా మారుతోంది.

Tags:    

Similar News