ప్ర‌భాస్ మ‌ళ్లీ షారుక్ ఖాన్ తో ఢీ అంటాడా?

అయితే భారీ విజువల్ ఎఫెక్ట్స్ , నిర్మాణ విలువల కారణంగా షూటింగ్ ఆలస్యమైతే ప్లాన్ సీ ని అమ‌లు చేయాల‌ని చూస్తున్నారు.;

Update: 2026-04-05 15:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరోసారి భారీ బాక్సాఫీస్ పోరుకు రంగం సిద్ద‌మ‌య్యే అవ‌కాశం ఉందా?అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మరోసారి థియేటర్ల వద్ద తలపడే అవకాశం ఉందన్న‌ది ప్రాధ‌మిక స‌మాచారం. గతంలో ఇద్ద‌రు హీరోలు న‌టించిన‌`సలార్` - `డంకీ` చిత్రాల మధ్య జరిగిన హోరాహోరీ పోరును తలపించేలా? ఈసారి `ఫౌజీ - `కింగ్` చిత్రాల మధ్య క్లాష్ ఉంటుందా? అన్న సందేహాలు బ‌ల‌ప‌డుతున్నాయి.ప్రస్తుతం షారుక్ ఖాన్ న‌టిస్తోన్న క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ `కింగ్` చిత్రాన్ని డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

అధికారికంగా రిలీజ్ ను కూడా ప్ర‌క‌టించారు. ఈ సినిమాతో షారుక్ కుమార్తె సుహానా ఖాన్‌ వెండి తెరకు పరిచయం అవుతుంది. దీంతో షారుక్ కింగ్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ పీరియాడిక్ డ్రామా `ఫౌజీ` షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను ముందుగా ఆగస్టు లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. ఇప్ప‌టికే అదే తేదీకి యూనిట్ క‌ట్టుబ‌డి ఉంది. కానీ చిత్రం అప్ప‌టికీ పూర్తికాక‌పోతే గ‌నుక ద‌స‌రా కానుక‌గా అక్టోబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ బీని కూడా సిద్దం చేసి పెట్టుకున్నారు.

అయితే భారీ విజువల్ ఎఫెక్ట్స్ , నిర్మాణ విలువల కారణంగా షూటింగ్ ఆలస్యమైతే ప్లాన్ సీ ని అమ‌లు చేయాల‌ని చూస్తున్నారు. అక్టోంబ‌ర్ నుంచి డిసెంబర్ నెలకు వాయిదా వేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. నిజంగా `ఫౌజీ` అక్టోబర్ నుండి డిసెంబర్‌కు మారితే షారుక్ `కింగ్` సినిమాకు గట్టి పోటీ తప్పదు. ఫౌజీని కూడా క్రిస్స్ కానుక‌గానే రిలీజ్ చేస్తారు. గత ఏడాది క్రిస్మస్ సమయంలో `సలార్` - `డంకీ` మధ్య ఎలాంటి పోటీ నెల‌కొందో తెలిసిందే. `స‌లార్` డిసెంబ‌ర్ 22న రిలీజ్ అయితే ఆ ముందు రోజే అంటే డిసెంబ‌ర్ 21న రిలీజ్ అయింది.

కానీ ఈ పోటీలో ప్రభాస్ భారీ వసూళ్లతో పైచేయి సాధించారు. తాజాగా మళ్ళీ అదే పండుగ సీజన్‌లో ఇద్దరు సూపర్ స్టార్స్ తలపడితే? బాక్సాఫీస్ వద్ద వార్ త‌ప్ప‌దు. ముఖ్యంగా తెలుగు, హిందీ మార్కెట్లలో థియేటర్ల కేటాయింపు విషయంలో పెద్ద యుద్ధమే జ‌ర‌గొచ్చు. సింగిల్ లాంగ్వేజ్ అంటూ `ధురంధ‌ర్` విసిరిన స‌వాల్ ను టాలీవుడ్ నుంచి ప్ర‌భాస్ తీసుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. షారుక్ కూడా త‌క్కువేం కాదు. ప్ర‌భాస్ పై అప్ప‌ర్ హ్యాండ్ త‌న‌దే అవ్వ‌డం కోసం చేయాల్సిన ప్ర‌య‌త్నాల్ని చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News