• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దర్శకుడి కాళ్లు...

దర్శకుడి కాళ్లు పట్టుకున్న స్టార్ హీరో!

| బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారిలో వివేక్ అగ్ని హోత్రి కూడా ఒకరు

By - Tupaki Desk
Update: 2023-08-16 12:44 GMT

బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారిలో వివేక్ అగ్ని హోత్రి కూడా ఒకరు. కశ్మీరీ ఫైల్స్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించాడు. కశ్మీరీ పండిట్స్ ముస్లిం ల చేతిలో పడిన కష్టాన్ని ఆయన ఈ చిత్రంతో తెరకెక్కించారు. అయితే, ఈ మూవీని కొందరు బాగా మద్దతు ఇవ్వగా, మరి కొందరు విమర్శించారు.

కావాలనే ముస్లింలను టార్గెట్ చేశారు అని చాలా మంది ఈ సినిమాని నిషేధించారు. కానీ, ఈ సినిమాని చాలా మంది ఆదరించారు. కాసుల వర్షం కూడా కురిసింది. ఈ సినిమాతో వివేక్ అగ్నిహహోత్రి మాత్రం చాలా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ది వాక్సిన్ వార్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది.

కాగా, తాజాగా ఆయన బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రణవీర్ సింగ్ తన కాళ్లు పట్టుకున్నాడంటూ షాకిచ్చాడు. గతంలో రణవీర్ న్యూడ్ ఫోటో షూట్ చేయగా, అది వివాదమైంది. అయితే, ఆ సమయంలో తాను మాత్రం రణవీర్ ని సమర్థించానని, దానికి కృతజ్ఞతగా రణవీర్ సింగ్ తన పాదాలు తాకాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు ఈ డైరెక్టర్ టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ టార్గెట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా విడుదల అయిన రోజే తన కాశ్మీరీ ఫైల్స్ విడుదల చేశారు. అయితే రాధేశ్యామ్ డిజాస్టర్ కావడం కూడా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా భాగా జనాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు తన కొత్త చిత్రం వ్యాక్సిన్ వార్ కూడా ప్రభాస్ సాలార్ మూవీ విడుదల రోజే విడుదల చేస్తుండటం విశేషం. కరోనా సమయంలో వ్యాక్సిన్ పేరుతో జరిగిన దోపిడీపై ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు.

ఇక ఈ మూవీని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతూ ఉండటం విశేషం. కాగా, వివేక్ కావాలనే ప్రభాస్ తో పోటీ పడుతున్నాడని, ఆరోజే తన సినిమాలు విడుదల చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన కావాలనే ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వివేక్ అగ్నిహోత్రి మాత్రం అదేమీ లేదు, ప్రభాస్ మెగా స్టార్ అని చెబుతూనే, ప్రభాస్ తో పోటీ పడుతుండటం గమనార్హం.

Tags:    
  • Vivekagnihotri 
  • Ranveersingh 
  • Ranveernude 
  • Kashmirfiles 
  • Thevaccinewar 
  • Bollywood 
  • Ranveer 
  • Salaarmovie 
  • Prabhas 
  • Prashanthneel 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS