కశ్మీర్ బాధిస్తే బెంగాల్ వెంటాడుతుంది
సంచలనాత్మక డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అగ్నిహోత్రి దర్శకత్వంలో తాజాగా వస్తోన్న సినిమా ది బెంగాల్ ఫైల్స్: రైట్ టు లైఫ్.;
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కాంట్రవర్సీలు అవడంతో పాటూ బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్లుగా కూడా నిలిచాయి. మరీ ముఖ్యంగా ది కశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ లాంటి సినిమాలు కంటెంట్ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
సంచలనాత్మక డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అగ్నిహోత్రి దర్శకత్వంలో తాజాగా వస్తోన్న సినిమా ది బెంగాల్ ఫైల్స్: రైట్ టు లైఫ్. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుండగా, తాజాగా మొదటి భాగం టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 1.26 నిమిషాల నిడివి ఉన్న టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కశ్మీర్ ఒకవేళ మిమ్మల్ని బాధపెట్టి ఉంటే, బెంగాల్ మిమ్మల్ని వెంటాడుతుందని టీమ్ పేర్కొంది.
బెంగాల్ లో నాటి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను డైరెక్టర్ ఈ సినిమాలో చూపించినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. టీజర్ లోని సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ హృదయాలను తప్పక కదిలించడం ఖాయమని టీజర్ స్పష్టం చేస్తుంది. మొత్తానికి టీజర్ తోనే ది బెంగాల్ ఫైల్స్ సినిమా మంచి హైప్ ను పెంచుకుంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.