అనుకోకుండా మిస్ ఇండియా పోటీల్లోకి వెళ్లా!

త‌ర్వాత జాబ్ చేస్తున్నప్పుడే లైఫ్ లో ఏదొక కొత్త‌ద‌నం కావాల‌నిపించి.. అప్పుడు అనుకోకుండా ఇనార్బిట్ మాల్ లో మిస్ ఇండియా ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయ‌నే విష‌యం తెలిసింద‌ని, అలా తను అందాల పోటీల్లోకి ఎంట‌రైన‌ట్టు చెప్పింది.;

Update: 2026-02-16 19:30 GMT

మాన‌స వార‌ణాసి. 2020 మిస్ ఇండియా టైటిల్ విన్న‌ర్. తెలుగ‌మ్మాయి అయిన మాన‌స అంద‌రికీ సుప‌రిచితురాలే. దేవకీ నంద‌న వాసుదేవ మూవీతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన మాన‌స ఆ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకుని రీసెంట్ గా క‌పుల్ ఫ్రెండ్లీ అనే సినిమా చేసింది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న మాన‌స‌, అస‌లు తాను మిస్ ఇండియా పోటీల్లోకి ఎలా వెళ్లిందో రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

కాలేజీ రోజుల నుంచే త‌న‌కు అన్ని కాంపిటిష‌న్స్ లో పాల్గొనే అల‌వాటు ఉంద‌ని, సింగింగ్, కల్చరల్ ఈవెంట్స్, డిబేట్స్.. ఏది ఉన్నా ముందుండేదాన్నని, ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్న చాలా మంది ఫ్రెండ్స్ ఉండటం వల్ల గ్లామర్, స్టైల్, ర్యాంప్ వాక్ వంటి విషయాలపై కూడా ఆసక్తి పెరిగింద‌ని ఆమె వివరించింది.

ముందు ప్లాన్ చేసుకున్న‌ది కాదు

త‌ర్వాత జాబ్ చేస్తున్నప్పుడే లైఫ్ లో ఏదొక కొత్త‌ద‌నం కావాల‌నిపించి.. అప్పుడు అనుకోకుండా ఇనార్బిట్ మాల్ లో మిస్ ఇండియా ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయ‌నే విష‌యం తెలిసింద‌ని, అలా తను అందాల పోటీల్లోకి ఎంట‌రైన‌ట్టు చెప్పింది. అంతేకాదు, ఆ పోటీల‌కు వెళ్లాల‌నేది కూడా ఒక స్పాంటేనియ‌స్ డెసిష‌న్ అని, ముందే ప్లాన్ చేసుకున్న‌ది కాద‌ని మానస చెప్పుకొచ్చింది.

న‌న్ను నేను చాలా మెరుగుప‌రుచుకున్నా..

మొద‌టి సారి ఆడిష‌న్ కు వెళ్లిన‌ప్పుడు ఆ ఎక్స్‌పీరియెన్స్ త‌న‌కు చాలా కాన్ఫిడెన్స్ ను ఇచ్చింద‌ని, అదే త‌న జ‌ర్నీకి మొద‌టి అడుగ‌ని మానస గుర్తు చేసుకుంది. మిస్ ఇండియా స్టేజ్ త‌న‌లోని నైపుణ్యాల‌ని వెలికి తీసింద‌ని చెప్పిన మాన‌స‌, దాని వ‌ల్లే త‌న‌కు స్టేజ్ ప్రెజెన్స్, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్, గ్రూమింగ్.. ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ త‌న‌ను తాను మెరుగుప‌ర‌చుకునే ఛాన్స్ క‌లిగింద‌ని తెలిపింది.

మిస్ ఇండియా అనేది కేవ‌లం బ్యూటీ కాంపిటిష‌న్ మాత్ర‌మే కాద‌ని, మ‌న వ్య‌క్తిత్వాన్ని ప‌రీక్షించే వేదికని, అక్క‌డ నేర్చుకున్న ఎన్నో విష‌యాలు, న‌టిగా త‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని మాన‌స చెప్పింది. ఈ విష‌యంలో త‌న‌కు త‌ల్లిదండ్రుల నుంచి ఎంతో ప్రోత్సాహం ల‌భించింద‌ని చెప్పిన మాన‌స, స‌డెన్ గా తీసుకున్న ఒక చిన్న డెసిష‌న్, త‌న జీవితాన్ని ఊహించ‌ని మ‌లుపు తిప్పింద‌ని పేర్కొంది.

Tags:    

Similar News