సుజీత్ త‌ర్వాతి అడుగు ఎటువైపు?

ఈ పరిస్థితుల్లో ఓజి2 రెగ్యులర్ షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినా, ఈ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.

Update: 2026-07-17 18:30 GMT

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజి బాక్సాఫీస్ వద్ద మంచి స‌క్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ టైమ్ లోనే దానికి సీక్వెల్‌గా ఓజి2 కూడా రూపొందనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సుజీత్ తర్వాతి ప్రాజెక్ట్ ఇదే అవుతుందని అభిమానులు భావించారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఓజి2 మొద‌ల‌వ‌డానికి మరికొంత టైమ్ పట్టే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారని, కొంతకాలం రెస్ట్ తీసుకున్న తర్వాతే మళ్లీ సినిమా షూటింగ్‌లకు హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఓజి2 రెగ్యులర్ షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినా, ఈ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఇదే టైమ్ లో సుజీత్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. నేచురల్ స్టార్ నానితో బ్లడీ రోమియో అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆయన తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఆడియ‌న్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. కానీ సుజీత్ ముందుగా ఓజి2కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో బ్లడీ రోమియో మరింత ఆలస్యమవుతుందని అంతా భావించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఆ సినిమా పూర్తయ్యే సమయానికి ఓజి2 ఇంకా సెట్స్‌పైకి రాకపోతే సుజీత్ తన టైమ్ ను ఖాళీని ఉంచ‌కుండా నానితో బ్లడీ రోమియోను ముందుగా ప్రారంభించే దిశగా ప్లానింగ్ జరిగే అవకాశాలు లేక‌పోలేదు.

ఇది సుజీత్ కెరీర్ పరంగా కూడా సరైన డెసిష‌న్ గా మారొచ్చు. వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూడకుండా, ఇప్పటికే కమిటైన సినిమాను ముందుకు తీసుకెళ్తే డైరెక్ట‌ర్ వర్క్‌ఫ్లో కూడా కొనసాగుతుంది. మరోవైపు నాని కూడా తన త‌ర్వాతి సినిమాల లైనప్‌ను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు నిర్మాతల నుంచి గానీ, సుజీత్ లేదా పవన్ కళ్యాణ్ టీమ్ నుంచి గానీ ఎలాంటి అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు. అందువల్ల ఈ వార్త‌ల్ని ప్ర‌స్తుతానికి ఊహాగానాలుగానే చూడాలి. అయినప్పటికీ ఓజి2 ఆలస్యమైతే, ఆ గ్యాప్‌ను బ్లడీ రోమియో భర్తీ చేసే అవకాశాలు మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చగా మారాయి. అభిమానులు కూడా సుజీత్ నెక్ట్స్ స్టెప్ ఏ ప్రాజెక్ట్ వైపు పడుతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News