రూ.100కోట్ల డ్రీమ్ మూవీ.. ఫస్ట్ స్టెప్ సరిగ్గా పడితే..

అక్కినేని నాగార్జున కెరీర్‌ లో 100వ చిత్రం అంటే అభిమానుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండటం కామన్. ఇప్పటి వరకు ఎన్నో విజయాలు అందుకున్న నాగార్జునకు ఇది మైల్ స్టోన్ మూవీ.

Update: 2026-07-18 00:30 GMT

అక్కినేని నాగార్జున కెరీర్‌ లో 100వ చిత్రం అంటే అభిమానుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండటం కామన్. ఇప్పటి వరకు ఎన్నో విజయాలు అందుకున్న నాగార్జునకు ఇది మైల్ స్టోన్ మూవీ. అందుకే ఆ ప్రాజెక్టుపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్‌ ను ముందుకు తీసుకెళ్లిన మూవీ టీమ్, తాజాగా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌ కు సంబంధించిన ప్రకటన చేయడంతో ఆ సినిమాపై మరోసారి చర్చ మొదలైంది.

సాధారణంగా స్టార్ హీరోల మైల్ స్టోన్ మూవీలను స్టార్టింగ్ నుంచే భారీగా ప్రమోట్ చేస్తుంటారు. కానీ నాగార్జున 100వ సినిమా విషయంలో మాత్రం భిన్నమైన వ్యూహం కనిపించింది. సినిమా షూటింగ్ మిడిల్ స్టేజ్ కు చేరుకున్నప్పటికీ అధికారికంగా ఒక్క పోస్టర్ కూడా విడుదల కాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఏదైనా పెద్ద అప్డేట్ వస్తుందేమో అని అందరూ ఎదురుచూశారు.

అయితే ఆగస్టు వరకు వేచి చూడకుండా మూవీ టీమ్ ముందుగానే ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో అభిమానుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా విడుదల చేసిన పోస్టర్‌ లో కనిపించిన కోర్టు రూమ్ బ్యాక్‌ డ్రాప్, గాజు గ్లాసులో ఉన్న టూత్ బ్రష్ వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. కథ ఏంటి? నాగార్జున పాత్ర ఎలా ఉండబోతోంది? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

ఆ సినిమా నాగార్జునకు మరో కారణంతో కూడా కీలకంగా మారింది. ఇటీవల కాలంలో ఆయన చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సందర్భాలు తక్కువే. అందుకే 100వ సినిమాతో ఒక పెద్ద కమర్షియల్ విజయాన్ని అందుకోవాలనే టార్గెట్ తో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఆ చిత్రాన్ని తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

అయితే సినిమా విజయంలో ప్రమోషన్స్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు విడుదల కాబోయే ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌ ను ఆ ప్రాజెక్టుకు తొలి పరీక్ష అనే చెప్పాలి. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా ఉంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో స్టోరీ, పాత్రలపై సరైన హింట్ ఇవ్వగలిగితే మార్కెట్‌ లో కూడా మంచి బజ్ ఏర్పడుతుంది.

నిజానికి ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిలబెట్టేలా తొలి అడుగు పడితేనే సినిమా జర్నీ మరింత స్ట్రాంగ్ గా మారుతుంది. ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, విడుదలకు ముందే పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది. అందుకే నాగార్జున 100వ సినిమా తొలి ప్రమోషనల్ స్టెప్ ఎంత బలంగా పడుతుంది? అని అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ స్టెప్ సరిగ్గా పడితే, డ్రీమ్ ప్రాజెక్ట్ రూ.100 కోట్ల టార్గెట్ చేరుకునే వేలో ముందుకు సాగడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.

Tags:    

Similar News