లవ్ స్టోరీ రివీల్ చేసిన శివాని.. ఆ అబ్బాయి ఎవరో చెప్పేసిందిగా?
కాత్యాయిని.. లిటిల్ హార్ట్స్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.;
కాత్యాయిని.. లిటిల్ హార్ట్స్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె అసలు పేరు శివాని నాగారం..కానీ లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయిని పాత్రతో ఊహించని ఇమేజ్ దక్కించుకుంది. అలాంటి ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం హే భగవాన్. సుహాస్ , శివానీ నాగారం జంటగా సీనియర్ నటుడు వీ.కే.నరేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ హే భగవాన్. గోపి అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. బన్నీ వాసు, వంశీ నందిపాటి కలసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా సెన్సార్ కి వెళ్లగా..కొన్ని కారణాలవల్ల ఈ సినిమా టైటిల్ లో మార్పు చేస్తూ.. ' హే భగవాన్' కాస్త 'హే బల్వంత్' గా చివరిలో మార్చేశారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సత్యం రాజేష్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చర్చించారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన శివాని నాగారం వ్యక్తిగత విషయాలను కూడా ఆయన బయటకు తీసే ప్రయత్నం చేశారు.. అందులో భాగంగానే సత్యం రాజేష్ మాట్లాడుతూ.. "లిటిల్ హార్ట్స్ సినిమాలో మీకంటే చిన్న అబ్బాయిని ప్రేమించినట్టు.. రియల్ లైఫ్ లో కూడా ఎవరైనా మీకు అలా ప్రపోజ్ చేశారా?" అని ప్రశ్నించారు.
శివాని నాగారం మాట్లాడుతూ.. "ట్యూషన్ లో ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు అని చెబుతుండగానే.. నేను ఇదివరకే సుహాస్ తో మాట్లాడాను..ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటారు అని.. కానీ నువ్వేమో లేదన్నయ్యా.. మంచి అమ్మాయి అని చెప్పావు.. మరి ఇదేంటి అని ఆమెను ఆట పట్టించే ప్రయత్నం చేశారు సత్యం రాజేష్. మళ్లీ ఆమె మాట్లాడుతూ.." నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు. నా తమ్ముడి వయసున్న అబ్బాయి నా దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇచ్చి అక్క ఐ లవ్ యు అని చెప్పాడు. అంతకుమించి ఇంకేం లేదు" అంటూ చెప్పుకొచ్చింది శివాని నాగారం. మొత్తానికైతే శివాని నాగారం కంగారు పడ్డ దృశ్యాలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. సత్యం రాజేష్ ఏదో బయటకు లాగాలనే ప్రయత్నం చేసి.. ఆమెను కంగారు పెట్టేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు .
ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో కాలేజీలో కానీ ఇండస్ట్రీలో కానీ మీకు ఎవరంటే క్రష్ అని ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ "అప్పట్లో మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం ఉండేది " అంటూ చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు మీ అభిప్రాయం మారిపోయిందా అని మళ్లీ ప్రశ్నించగా.." వారికి పెళ్లయిపోయింది కదా" అంటూ సిగ్గుతో తలవంచుకుంది. శివాని మొత్తానికైతే అప్పట్లో మహేష్ బాబు అల్లు అర్జున్ తన క్రష్ అంటూ చెప్పకనే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ ప్రస్తుతం ఎవరూ లేరు అని కూడా తెలిపింది.