ప్ర‌గ్య జైశ్వాల్ రెడ్ హాట్ లుక్ వైర‌ల్

ముంబై బ్యూటీ ప్రగ్య జైస్వాల్ నిరంత‌ర‌ సోషల్ మీడియా పోస్టుల‌కు బోలెడంత ఫాలోయింగ్ ఉన్న‌ సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-02-16 18:47 GMT

ముంబై బ్యూటీ ప్రగ్య జైస్వాల్ నిరంత‌ర‌ సోషల్ మీడియా పోస్టుల‌కు బోలెడంత ఫాలోయింగ్ ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. ల‌క్ష‌లాదిగా ఫ్యాన్స్ త‌న‌ను అనుస‌రిస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. ప్ర‌గ్య‌ షేర్ చేసిన `స‌ర్వింగ్ సిట్ర‌స్` ఫోటో షూట్ హాట్ టాపిగ్గా మారింది.




 


ప్రగ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరెంజ్ కలర్ థై స్లిట్ డ్రెస్ ధరించి సెలయేటి పక్కన దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు `పుల్లటి పండు అందిస్తున్నాను`` అని రాసింది. ఈ కొత్త లుక్ లో త‌న అందం, డ్రెస్సింగ్ స్టైల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్ర‌గ్య మునుప‌టి కంటే ఈ లేటెస్ట్ లుక్ లో హా*గా ఉందంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.




 


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, ప్రగ్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ఇటీవ‌ల అఖండ 2తో భారీ విజ‌యం అందుకుంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన‌ ఈ భారీ సీక్వెల్‌లో త‌న న‌ట‌న‌కు చ‌క్క‌ని పేరొచ్చింది. త‌దుప‌రి బాలీవుడ్ లో సీనియ‌ర్ న‌టుడు స‌న్నీడియోల్ స‌ర‌స‌నా ఓ చిత్రంలో న‌టిస్తోంద‌ని స‌మాచారం.




 


ప్ర‌గ్య పార్టీ లైఫ్ విష‌యానికి వ‌స్తే, త‌న‌కంటూ మంచి స్నేహితుల బృందం ఉంది. ఇందులో మంచు ల‌క్ష్మి, ర‌కుల్ ప్రీత్ చాలా కాలంగా మంచి స్నేహితులు. ఆ ఇరు కుటుంబాల‌తో క‌లిసి ప్ర‌గ్య సెల‌బ్రేట్ చేసుకున్న ఫోటోలు ఈడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి. స్నేహితులు కలిసి పార్టీలు చేసుకోవడం, జిమ్‌లో వర్కవుట్స్ చేయడం, విదేశీ పర్యటనలకు వెళ్లడం రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే.మొత్తానికి ప్రగ్య తన గ్లామర్‌తో అటు సోషల్ మీడియాను, ఇటు సినిమాలతో బాక్సాఫీస్‌ను బ్యాలెన్స్ చేస్తోంది.

Tags:    

Similar News