టాక్సిక్ వెనక్కి తగ్గకపోవడానికి అసలు కారణం ఇదే!
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ‘రాకింగ్ స్టార్’ యశ్ వర్సెస్ రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వార్ గురించే చర్చ నడుస్తోంది.;
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ‘రాకింగ్ స్టార్’ యశ్ వర్సెస్ రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వార్ గురించే చర్చ నడుస్తోంది. మార్చి 19న యశ్ ‘టాక్సిక్’, రణవీర్ సింగ్ ‘ధురందర్ 2’ ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో, ఎవరో ఒకరు తప్పుకుంటే బాగుంటుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపించింది. కానీ యశ్ మాత్రం ‘నో కాంప్రమైజ్’ అంటున్నారు. ఇది కేవలం ‘ఈగో’ సమస్య కాదు, దీని వెనుక పక్కా బిజినెస్ లాజిక్ ఉందని హింట్ ఇచ్చారు.
గతేడాది మార్చిలోనే ‘టాక్సిక్’ టీమ్ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అప్పటికే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం వెళ్లడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యజమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చని యశ్ భావిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు వెనక్కి తగ్గితే అది సినిమా కంటెంట్‌పై నమ్మకం లేనట్టుగా నెగిటివ్ సిగ్నల్ వెళ్తుందని ఆయన ఆలోచన. అందుకే బాలీవుడ్ భారీ చిత్రం వస్తున్నా సరే, తన ‘వార్’ డిక్లేర్ చేసేశారు.
ఈ క్లాష్ లో యశ్ వెనక్కి తగ్గకపోవడానికి ప్రధాన కారణం ‘లాంగ్ రన్’ వసూళ్లు, బలమైన బిజినెస్ డీల్స్. కేవలం ఫస్ట్ డే ఓపెనింగ్స్ కోసమే కాకుండా, సినిమా కంటెంట్ బాగుంటే లాంగ్ రన్ లో ‘ధురందర్ 2’ని తట్టుకోగలమనే ధీమా యశ్ లో కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు 120 కోట్లకు డీల్ కుదుర్చుకోగా, ఓవర్సీస్ హక్కులు కూడా 105 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇంత భారీ పెట్టుబడులు పెట్టినప్పుడు వెనక్కి తగ్గడం బిజినెస్ పరంగా రిస్క్ అని యశ్ భావిస్తున్నారు.
మరోవైపు, బాలీవుడ్ మేకర్స్ తీరుపై యశ్ కాస్త అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. సౌత్ లో ఏ హీరో అయినా డేట్ ఫిక్స్ చేసుకుంటే వేరే వాళ్లు కనీసం ఒక ఫోన్ కాల్ చేసి చెప్తారు, కానీ బాలీవుడ్ లో ఆ కమ్యూనికేషన్ లేదని ఆయన వాపోతున్నారు. “టాక్సిక్ అనౌన్స్ చేసినప్పుడే అందరికీ తెలిసినా, మళ్ళీ అదే రోజున ధురందర్ 2 రావడం పద్ధతి కాదు” అనేది యశ్ టీమ్ వెర్షన్. అందుకే ఈసారి తగ్గేదేలే అని ఫిక్స్ అయిపోయారు.
ఈ క్లాష్ వల్ల నార్త్ లో స్క్రీన్ల కేటాయింపులో ఇబ్బందులు రావచ్చు కానీ, సౌత్ లో మాత్రం యశ్ హవానే కొనసాగుతుంది. ‘KGF 2’ తో సృష్టించిన క్రేజ్ ఇప్పుడు ‘టాక్సిక్’ కి భారీగా హెల్ప్ అవుతోంది. ముఖ్యంగా తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో యశ్ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉంది. రణవీర్ సింగ్ కి నార్త్ లో పట్టున్నా, పాన్ ఇండియా రేంజ్ లో యశ్ మార్కెట్ ఇప్పుడు చాలా బలంగా ఉంది. ఏదేమైనా మార్చి 19న బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుకానుంది. ‘టాక్సిక్’ లో ఉన్న డార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ధురందర్ 2’ లోని స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లో ఏది ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.