• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిజీ బిజీగా విశ్వక్.....

బిజీ బిజీగా విశ్వక్.. వ్వాటే లైనప్!

| టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-03-30 06:47 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుసగా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఒక్కొక్క సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఆరేళ్ల పాటు షూటింగ్ జరిగిన గామి మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోర శంకర్ పాత్రలో నటించి మంచి హిట్ ను అందుకున్నారు.

ఇక త్వరలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో సందడి చేయనున్నారు మాస్ కా దాస్. విశ్వక్ నటించిన ఈ పొలిటికల్ విలేజ్ డ్రామా.. సమ్మర్ కానుకగా మే17వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. హీరోయిన్ గా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, లీడ్ రోల్ లో అంజలి నటిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతోపాటు విశ్వక్ సేన్ అనేక నిర్మాణ సంస్థలతో పని చేస్తున్నారు. అందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ నిన్న వచ్చాయి. ఆ వివరాలివే..

మెకానిక్ రాకీ.. రవితేజ ముళ్ళపూడి దర్శకుడిగా ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగమ్మాయి మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నిన్న మేకర్స్.. ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందులో విశ్వక్ సేన్.. స్టైలిష్ గెడ్డంతో మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

లైలా.. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ ఇటీవల భగవంత్ కేసరితో సూపర్ హిట్ కొట్టిన షైన్ స్క్రీన్స్ తో పని చేస్తున్నారు. ఈ మూవీతో మరో కొత్త దర్శకుడు రామ్ నారాయణ్.. ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. తనిష్క్ బాగ్చి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో విశ్వక్ సేన్.. లేడీ గెటప్ లో కనిపించనున్నారు.

వీటితోపాటు విశ్వక్ సేన్.. సుధాకర్ చెరుకూరి తో మరో సినిమా చేస్తున్నారు. ఎస్ ఎల్ వీ బ్యానర్ పై పీరియాడిక్ డ్రామాగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరికొన్ని నెలల్లో ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. వీరితో పాటు మరికొంతమంది టాలెంటెడ్ డైరెక్టర్లతో విశ్వక్ సేన్.. చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అన్ని ప్రకటనలు రానున్నాయన్నమాట. మరి విశ్వక్ వరుస చిత్రాలతో ఎలాంటి హిట్లు కొడతారో చూడాలి.

Tags:    
  • Viswaksen 
  • Gangsofgodavari 
  • Tollywood 
  • Machenicrocky 
  • Filmindustry 
  • Gaami 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS