• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఊర మాస్ లో విశ్వక్, ఆయేష...

ఊర మాస్ లో విశ్వక్, ఆయేష మోత

| టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. 2024లో వరుస చిత్రాలతో అలరించనున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-03-25 12:06 GMT

టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. 2024లో వరుస చిత్రాలతో అలరించనున్న విషయం తెలిసిందే. ఇటీవల గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్.. మరికొద్ది రోజుల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సందడి చేయనున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. మే17వ తేదీన సమ్మర్ కానుకగా ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.\


ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ చిందులేసింది. మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా.. ఈ మోత మోగిపోద్ది సాంగ్ ను హోలీ పండుగ రోజు విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు. చెప్పినట్లు నేడు రిలీజ్ చేసి అసలైన మాస్ ఫెస్టివల్ ను తీసుకొచ్చారు మేకర్స్.

కొవ్వూరు ఏరియాలో ఎవరూ కట్టని సీర కట్టి.. కడియపు లంగ పరిసరాల్లో ఎవరూ పెట్టని పూలు పెట్టి.. మోత.. మోత.. మోత మోగిపోద్ది అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ దుమ్మురేపుతోంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. మాస్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. అప్పుడే ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. టాలీవుడ్ లో బెస్ట్ ఐటెం సాంగ్ గా మోత మోగిపోద్ది మారింది. సోషల్ మీడియాలో మోత మోగించేస్తోంది.

ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా.. మానసి ఆలపించింది. తన వాయిస్ తో ఉర్రూతలూగించింది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా తన మార్క్ చూపించారు. సాంగ్ కంపోజింగ్ వేరే లెవల్ అని చెప్పాలి. మాస్ బీట్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఇక ఆయేషా ఖాన్ కోసం చెప్పనక్కర్లేదు. తన స్టెప్పులు, అందం, అభినయంతో కుర్రకారు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. విశ్వక్ ఎప్పటిలానే మరోసారి అదరగొట్టేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సుట్టంలా సూసి పాట చార్ట్ బస్టర్ గా నిలిచి యూట్యూబ్ లో దాదాపు 50 మిలియన్ల వ్యూస్ అందుకుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు విశ్వక్ సేన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీతో విశ్వక్ సేన్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.

Full View
Tags:    
  • Viswaksen 
  • Gangsofgodavari 
  • Krishnachaitanya 
  • Mothasong 
  • Nagavamsi 
  • Tollywood 
  • Holi 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS