• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గామి.. అది పెద్ద సర్...

గామి.. అది పెద్ద సర్ ప్రైజ్ : విశ్వక్ సేన్

| గతేడాది దాస్ కా ధమ్కీ మూవీతో హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. 2024లో బోణీ వేసేశారు

By - Tupaki Desk
Update: 2024-03-13 18:09 GMT

గతేడాది దాస్ కా ధమ్కీ మూవీతో హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. 2024లో బోణీ వేసేశారు. ఆరేళ్లుగా షూటింగ్ జరుపుకున్న గామి చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టేశారు. శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన విడుదలైన ఈ సినిమా.. రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మేకర్స్ కు లాభాలు రాబడుతోంది.

విద్యాధర కాగిత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ కా దాస్.. ప్రయోగాత్మక రోల్ చేసి అదరగొట్టారు. మానవ స్పర్శ తట్టుకోలేని ఓ అఘోరగా కనిపించి తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. ఈ మూవీలో తెలుగమ్మాయి చాందినీ చౌదరీ డాక్టర్ జాహ్నవి రోల్ లో కనిపించి తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత థియేటర్ సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ అంతా సక్సెస్ జోష్ లో ఉంది.

ఇటీవల గామిపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై స్పందించిన హీరో విశ్వక్ సేన్.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి సినిమా కూడా తనకు ఒక ప్రయాణం లాంటిదని, చుట్టూ ఉన్న పరిస్థితులు తనకు విలువైన పాఠాలు నేర్పుతాయని చెప్పారు. ఈసారి సినీ లవర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ సర్ ప్రైజింగ్ గా ఉందని తెలిపారు. సినిమాను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని, గౌరవిస్తానని రాసుకొచ్చారు.

ప్రస్తుతం విశ్వక్ సేన్ లేటెస్ట్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాస్ కా దాస్ ఫ్యాన్స్ తోపాటు టాలీవుడ్ లవర్స్ స్పందిస్తున్నారు. గామి మూవీ చాలా బాగుందని, యాక్టింగ్ తో ఫిదా చేశారని చెబుతున్నారు. టాలీవుడ్ లో ఇలాంటి హిట్ సినిమాలు మరిన్ని తీయాలని కోరుతున్నారు. విశ్వక్ అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్టుల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.

గామి మూవీ తర్వాత త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విశ్వక్ సేన్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. దీంతోపాటు విశ్వక్.. మెకానిక్ రాకీ కూడా చేస్తున్నారు. కల్ట్ మూవీని నిర్మిస్తున్నారు. లైలా అనే మరో చిత్రంలో యాక్ట్ చేయనున్నారు. మరి విశ్వక్.. కొత్త సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

In Telugu cinema, each film is a journey for me, teaching valuable lessons about my surroundings. This time, the insights are even more surprising. Consistency remains my only response. Always love and respect cinema. #gaami #TELUGUcinema

— VishwakSen (@VishwakSenActor) March 13, 2024
Tags:    
  • Vishwaksen 
  • Gaamimovie 
  • Gaami 
  • Vishyadhar 
  • Chandini 
  • Tollywood 
  • Vishwaksentweet 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS