విష్ణు విశాల్ ఆర్యన్ ట్రైలర్ టాక్..!

కోలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు విష్ణు విశాల్.;

Update: 2025-10-19 06:41 GMT

కోలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు విష్ణు విశాల్. కేవలం లీడ్ రోల్ లో సినిమాలు చేయడమే కాదు విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లో సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. లేటెస్ట్ గా అతని బ్యానర్ లో తనే లీడ్ రోల్ లో తెరకెక్కిస్తున్న సినిమా ఆర్యన్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన విష్ణు విశాల్ ని ఒక్ మిస్టరీ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నియమిస్తారు. కిల్లర్ ని పట్టుకునేందుకు హీరో ఏం చేశాడు ఎలా అతన్ని కనిపెట్టాడు అన్నది ఆర్యన్ కథ.


ఇంట్రెస్టింగ్ గా ఆర్యన్ ట్రైలర్..

ఆర్యన్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమాగా శాంపిల్ ట్రైలర్ తోనే ఆసక్తి కలిగించింది. విష్ణు విశాల్ సొంత నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించారు. విష్ణు విశాల్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ఉంది. సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా మొత్తం విష్ణు విశాల్ భుజాన వేసుకుని నడిపించేలా ఉన్నాడు.

విష్ణు విశాల్ ఆర్యన్ సినిమాను ప్రవీణ్ కె డైరెక్ట్ చేస్తున్నారు. క్రైం థ్రిల్లర్ కి కావాల్సిన ఎంగేజ్మెంట్, స్క్రీన్ ప్లే అన్ని పర్ఫెక్ట్ గా రాసుకున్నట్టు ఉన్నాడు. ట్రైలర్ చూస్తే సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఉంది. ఆల్రెడీ విష్ణు విశాల్ కి ఇలాంటి క్రైం థ్రిల్లర్ సినిమాలతో సక్సెస్ అందుకున్న హిస్టరీ ఉంది. సో తప్పకుండా ఈ ఆర్యన్ కూడా ఇంప్రెస్ చేసేలా ఉన్నాడు.

లుక్ అతని ఇంటెన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా..

విష్ణు విశాల్ ఆర్యన్ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ ఫిక్స్ చేశారు. విష్ణు విశాల్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. క్రైం థ్రిల్లర్, సీడ్ ఎడ్జ్ థ్రిల్లర్ సినిమాలను తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తారు. ఐతే విష్ణు విశాల్ ఆర్యన్ కూడా అదే వరుసలో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.

విష్ణు విశాల్ ఆర్యన్ సినిమాను ఎంతో ప్యాషన్ తో తెరకెక్కించినట్టు ఉన్నారు. సినిమా ట్రైలర్ చూస్తే ప్రాజెక్ట్ కి కావాల్సిన సఫిషియెంట్ బడ్జెట్ భారీగానే పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక విష్ణు విశాల్ లుక్ అతని ఇంటెన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇలాంటి క్రైం థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ సినిమాలకు మ్యూజిక్ కూడా చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఫైనల్ గా విష్ణు విశాల్ చేసిన ఈ ఆర్యన్ అటెంప్ట్ ఎంతమేరకు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది అన్నది చూడాలి. విష్ణు విశాల్ ఆర్యన్ ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టాయి.

Full View
Tags:    

Similar News