అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. 'విరోష్' ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా!

ప్రసాద్స్ మల్టీప్లెక్స్, కూకట్‌ పల్లి, అమీర్‌ పేట, మియాపూర్, గచ్చిబౌలి, ఉప్పల్, ఎల్బీనగర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ సహా పలు ప్రాంతాల్లోని థియేటర్లలో సండే నైట్ హౌస్‌ ఫుల్ షోలు నమోదయ్యాయి.

Update: 2026-10-19 03:57 GMT

థియేటర్లలో ప్రేక్షకుల సందడి.. ట్యాంక్‌ బండ్‌ పై బతుకమ్మ సంబరాలు.. ఆ రెండింటి మధ్య ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పేర్లు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరూ జంటగా నటించిన రణబాలికి హైదరాబాద్‌ లోని మంచి రెస్పాన్స్ కనిపిస్తుండగా.. అదే సమయంలో ఆ జంట సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. దీంతో అటు సినిమా, ఇటు పండుగ సందడితో విరోష్ అభిమానులకు ఒకేసారి డబుల్ ధమాకా కనిపిస్తోంది.

 

అక్టోబర్ 16న విడుదలైన రణబాలి మూవీపై మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ ఉంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించడం, రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ ఆ అంచనాలను పెంచాయి. ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత హైదరాబాద్‌ లోని పలు థియేటర్లలో రాత్రి షోలకు సూపర్ రెస్పాన్స్ కనిపిస్తోంది. సిటీలోని 40కి పైగా థియేటర్లలో నైట్ షోలు ఫుల్ అయినట్లు మూవీ టీమ్ చెప్పింది.

 

ప్రసాద్స్ మల్టీప్లెక్స్, కూకట్‌ పల్లి, అమీర్‌ పేట, మియాపూర్, గచ్చిబౌలి, ఉప్పల్, ఎల్బీనగర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ సహా పలు ప్రాంతాల్లోని థియేటర్లలో సండే నైట్ హౌస్‌ ఫుల్ షోలు నమోదయ్యాయి. మరికొన్ని షోలు కూడా ఫుల్ అయినట్లు సమాచారం. హైదరాబాద్‌ తో పాటు వరంగల్‌ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని మూవీ టీమ్ తెలిపింది.

 

సినిమా థియేటర్లలో ఇలా సందడి చేస్తుంటే.. విజయ్, రష్మిక మరోవైపు తెలంగాణ సద్దుల బతుకమ్మ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌ పై నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాలకు ఆ క్రేజ్ కపుల్ అటెండ్ అయింది. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో విజయ్, రష్మిక అక్కడికి రావడంతో సందడి మరింత పెరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ.. పెళ్లి తర్వాత రష్మికతో కలిసి తెలంగాణలో జరిగే పెద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని ముందే అనుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మను చూస్తే చాలా ముద్దుగా అనిపిస్తుందని, తమ ఇంట్లో కూడా బతుకమ్మను తయారు చేస్తారని గుర్తుచేసుకున్నారు. మన పండుగలను ఇంత గ్రాండ్ గా నిర్వహించడం హ్యాపీగా ఉందని తెలిపారు. తెలంగాణ కోడలిగా సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రష్మిక పేర్కొంది.

నార్మల్ గా సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్, వసూళ్లపైనే డిస్కషన్ జరుగుతుంది. కానీ రణబాలి విషయంలో సినిమా వార్తలతో పాటు విజయ్, రష్మిక పర్సనల్ ఈవెంట్స్ అండ్ విజిట్స్ కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలా హైదరాబాద్‌ లో రణబాలి నైట్ షోలకు వస్తున్న రెస్పాన్స్, ట్యాంక్‌ బండ్‌ పై సద్దుల బతుకమ్మ వేడుకల్లో విరోష్ జంట సందడి.. రెండూ వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి.

Tags:    

Similar News