ఆ నలుగురు స్టార్ హీరోల ఫ్యాన్స్‌కి బిగ్ గుడ్‌న్యూస్
ఇక దసరా పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాల నుంచి కీలక అప్డేట్స్ వస్తాయని ఆయా హీరోల అభిమానులు, మీడియా వర్గాల వారు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్లో దసరా సందడి కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు సందడి చేస్తున్న విషయం తెల్సిందే. దసరా సెలవులను సద్వినియోగం చేసుకోవడం కోసం చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలను తెలుగు ప్రేక్షకులు తిరస్కరిస్తే, కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొత్తానికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దసరాకు స్టార్ హీరోల సినిమాలు, సూపర్ స్టార్ హీరోల సినిమాలు రాలేదు. అయినా కూడా ప్రేక్షకులు వచ్చిన సినిమాలను చూస్తూ దసరా పండుగ చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇక దసరా పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాల నుంచి కీలక అప్డేట్స్ వస్తాయని ఆయా హీరోల అభిమానులు, మీడియా వర్గాల వారు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ సినిమాల అప్డేట్స్...
ముఖ్యంగా ప్రభాస్ నటించిన ఫౌజీ, స్పిరిట్ సినిమాలకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలో ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. దసరా లేదా దీపావళి వరకు ప్రభాస్ సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ ను ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇటీవలే ప్రభాస్ స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఫౌజీ సినిమా విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. దసరా లేదా దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు ఆ సినిమా అప్డేట్ ఇస్తే తప్పకుండా మంచి రీచ్ ఉంటుంది అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అందుకే ప్రభాస్ రెండు సినిమాల అప్డేట్స్(టీజర్/పోస్టర్స్) అతి త్వరలోనే రానున్నాయి.
రంగస్థలం తర్వాత చరణ్-సుకుమార్ కాంబో మూవీ...
ఇక రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం ఇదే ఏడాది వస్తుందని తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గతంలో రంగస్థలం సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా రామ్ చరణ్‌కి మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో ఆ తర్వాత వచ్చిన పుష్ప రికార్డ్ల వర్షం కురిపించింది. పాన్ ఇండియా రేంజ్లో పుష్ప సినిమాను విడుదల చేయడం జరిగింది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల పుష్ప ప్రభంజనం కనిపించింది. అందుకే రామ్ చరణ్‌తో సుకుమార్ చేయబోతున్న సినిమాను సైతం పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులు అలరిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఆ సినిమా తాలూకు అప్డేట్ ను మరికొన్ని రోజుల్లోనే సుకుమార్ అండ్ టీం నుంచి వినబోతున్నాం. మైత్రి మూవీ మేకర్స్ వారు అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల సినిమాల అప్డేట్స్...
ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ సైతం అతి త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ డ్రాగన్ షూట్లో పాల్గొంటున్నాడు. దసరా కి ప్రత్యేకంగా సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ వీడియోను రెడీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. పండుగకి ఒక మంచి పోస్టర్ విడుదల చేయడంతో పాటు, సినిమా విడుదల తేదీ, ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను క్లారిటీగా చెప్పే అవకాశం ఉంది. కనుక అతి త్వరలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డ్రాగన్ యూనిట్ నుంచి పెద్ద సర్ప్రైజింగ్ న్యూస్ రావడం కన్ఫర్మ్ అయింది. ఎన్టీఆర్-నీల్ కాంబో డ్రాగన్ సినిమా పాన్ ఇండియా రేంజ్‌ను మించి విడుదల కాబోతున్నట్లుగా చెబుతున్నారు. కనుక సినిమా అప్డేట్ వస్తుంది అంటే కచ్చితంగా ఫ్యాన్స్ కి పెద్ద గుడ్ న్యూస్ కాదా మరి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందుతున్న 'రాకా' సినిమా అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ మూవీ అంటూ రాకా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కనుక రాకా సినిమా నుంచి వచ్చే అప్డేట్ కి పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఉంటుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అతి త్వరలోనే ఆ రేంజ్ సర్ప్రైజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు రాకా సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ నుంచి అతి త్వరలోనే కొత్త సినిమా అప్డేట్ వస్తుందనే వార్తలు వస్తున్నాయి. అది కూడా ఈ రెండు మూడు నెలల్లోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కొత్త సినిమా దర్శకుడు ఎవరు, ఇతర అప్డేట్స్ ఏంటీ అనేది ఇదే ఏడాది చివరి వరకు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా అతి త్వరలోనే రెండు బిగ్ గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి నలుగురు స్టార్ హీరోలు వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఏడాదిలో ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ కోసం బిగ్ అప్డేట్స్ వదలబోతున్నారు.