పండుగ కళ ఉట్టిపడేలా శ్రీలీల వైబ్స్
దసరా వైబ్స్ ఒక రోజు ముందే వచ్చేసాయి. శ్రీలీల తన తాజా ట్రెడిషనల్ లుక్‌తో దసరా వైబ్స్ ని క్రియేట్ చేసింది.
దసరా వైబ్స్ ఒక రోజు ముందే వచ్చేసాయి. శ్రీలీల తన తాజా ట్రెడిషనల్ లుక్‌తో దసరా వైబ్స్ ని క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో మరోసారి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సంప్రదాయబద్ధమైన దుస్తులలో మెరిసిపోతూ.. పండుగ శోభను.. దసరా నవరాత్రుల కళను పర్ఫెక్ట్గా ప్రతి బింబించింది. నదిటిన బొట్టు.. క్లాసిక్ ఆభరణాలు.. రాజసం ఉట్టిపడే స్టైలింగ్‌తో డివైన్ బ్యూటీలా అలరించింది.
ఈ ఫోటోలు పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే కామెంట్ సెక్షన్ అభిమానుల ప్రేమతో, హార్ట్ ఎమోజీలతో నిండిపోయింది. తోటి సినీ ప్రముఖులతో పాటు లక్షలాది మంది ఫ్యాన్స్ `అందాల దేవత`, `ఎథీరియల్ క్వీన్` అంటూ ప్రశంసలు కురిపించారు. నెటిజన్లు తన అందమైన నవ్వుకి, ఆకర్షణీయమైన చూపులకు ఫిదా అవుతూ కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
వెస్ట్రన్ వేర్ అయినా.. ట్రెడిషనల్ వేర్ అయినా తనదైన శైలిలో క్యారీ చేయడంలో శ్రీలీల దిట్ట. ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత వర్సటైల్ ఫ్యాషన్ ఐకాన్లలో ఒకరిగా నిలిచిన ఈ భామ ఈ కొత్త ఫోటోషూట్‌లో ఎంతో సహజమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది. క్లాసిక్ డిజైన్స్, మోడర్న్ టచ్‌ను సమన్వయం చేస్తూ ఈ అవుట్‌ఫిట్ ట్రెండింగ్‌గా మారింది.
ఈ పండుగ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా శ్రీలీలకున్న స్టార్ పవర్‌ను మరోసారి నిరూపించింది. తన గ్లామర్, ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో టాలీవుడ్ - సౌత్‌లో క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ తన ప్రతి లుక్‌తోనూ...వరుస సినిమాలతోనూ ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచేస్తోంది.
శ్రీలీల టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి `ఉస్తాద్ భగత్ సింగ్`, నితిన్‌తో `మాస్ జాతర` (రాబిన్ హుడ్), నవీన్ పొలిశెట్టితో `అనగనగా ఒక రాజు` చిత్రాలలో నటించింది. తమిళంలో ధనుష్‌తో `ఓఎమ్` అనే చిత్రంలోను శ్రీలీల నటించింది. ప్రస్తుతం హిందీలో కార్తీక్ ఆర్యన్-అనురాగ్ బసు కాంబినేషన్లో నటిస్తూ పాన్-ఇండియా స్థాయిలో తనదైన మార్క్ వేయడానికి శ్రీలీల సిద్ధమవుతోంది.