ఆ డబ్బులు ఎటు పోయాయి బిగ్‌బీ?
ఈ కార్యక్రమంలో సైఫ్‌తో పాటు పాల్గొన్న కరీనా కపూర్ కూడా ఆయన జోకులకు వత్తాసు పలుకుతూ మరింత సరదా వాతావరణాన్ని సృష్టించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూల్ అండ్ విట్నీ శైలితో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ప్రముఖ టెలివిజన్ క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి` (KBC) వేదికపై చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. భార్య కరీనా కపూర్ ఖాన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సైఫ్.. గతంలో తాను కేబీసీ షోలో పాల్గొన్న అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ చేసిన కామెడీ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
అసలు విషయంలోకి వెళితే.. ఓసారి కేబీసీ షోకి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన ముచ్చట్లను సైఫ్ ఎంతో సరదాగా పంచుకున్నారు. షోలో గెలుపొందిన తర్వాత తనకు ఇస్తామన్న ప్రైజ్ మనీ చెక్కు ఇప్పటివరకు అందలేదని, అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ గారి ఇంటి నుంచి ఆశించిన అతిథి మర్యాదలు, ముఖ్యంగా కమ్మని నెయ్యి కూడా తనకు దక్కలేదంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. సైఫ్ చెప్పిన ఫన్నీ జోక్ విన్న అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వేశారు.
ఈ కార్యక్రమంలో సైఫ్‌తో పాటు పాల్గొన్న కరీనా కపూర్ కూడా ఆయన జోకులకు వత్తాసు పలుకుతూ మరింత సరదా వాతావరణాన్ని సృష్టించారు. సాధారణంగా సీరియస్ రోల్స్ ..రాయల్ పాత్రల్లో కనిపించే సైఫ్ రియల్ లైఫ్‌లో ఎంత సరదాగా ఉంటారో? ఈ ఇన్సిడెంట్ మరోసారి నిరూపించింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ఈ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వేదికపై సైఫ్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుం టున్నాయి.
ఇలాంటి సెలబ్రిటీ షోలలో గెలిచే ప్రైజ్ మనీ .. సాంప్రదాయాల గురించి మాట్లాడటం కేవలం సరదా కోసమే అయినా? సైఫ్ చెప్పిన తీరు మాత్రం కడుపుబ్బా నవ్విస్తోంది. బచ్చన్ కుటుంబంతో సైఫ్-కరీనా దంపతులకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే అమితాబ్ షో గురించి సైఫ్ ఇలా పబ్లిక్‌గా కాస్త వ్యంగ్యంగా.. ఎంతో జోవియల్‌గా మాట్లాడటాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. నెయ్యి రాలేదనే ఆయన కంప్లైంట్ ఇప్పుడు మీమ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
సినిమాల విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు కరీనా కపూర్ కూడా తనదైన నటనతో దూసుకుపోతున్నారు. ఇంత బిజీ షెడ్యూల్స్ మధ్య రాయల్ కపుల్ ఏదైనా వేదికపై కనిపిస్తే చాలు వారి మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మెటీరియల్‌గా మారుతుంటాయి. తాజాగా కేబీసీ నెయ్యి & చెక్కు లొల్లి కూడా సరిగ్గా అదే కోవలో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
అమితాబ్ షోలో సైఫ్ అలీ ఖాన్ ఇచ్చిన ఫన్నీ రియాక్షన్ ఆయనలోని కామెడీ టైమింగ్‌ను మరోసారి బయటపెట్టింది. గెలిచిన డబ్బుల కోసం ఎదురుచూపులు.. ఇంటి భోజనం కోసం ఆశపడటం వంటి విషయాలను ఆయన చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఏదేమైనా? సైఫ్-కరీనాల క్యూట్ అండ్ ఫన్నీ జోడీ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ సెట్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.