సరైన టైమ్ లో 'స్పిరిట్'.. నార్త్ బాక్సాఫీస్‌పై వంగా మాస్టర్ స్కెచ్!

మార్చి నుంచి దీపావళికి వెళ్లడం వెనుక ఒక పక్కా పాన్ ఇండియా స్కెచ్ కనిపిస్తోంది. కొత్త డేట్ తో పాటు వదిలిన పోస్టర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది.

Update: 2026-10-18 07:38 GMT

'స్పిరిట్' అనుకున్నట్లుగానే పర్ఫెక్ట్ గానే సందీప్ రెడ్డి వంగా మొదటి నుంచి కాన్ఫిడెంట్ గానే చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మేకర్స్ సినిమా రేంజ్ కు తగ్గట్లుగా ఒక సాలిడ్ స్టెప్ తీసుకున్నారు. ప్రభాస్ పోలీస్ గెటప్‌ను థియేటర్లలో మరింత గ్రాండ్ గా ప్రెజెంట్ చేయడానికి ఏకంగా 2027 అక్టోబర్ 29న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

మార్చి నుంచి దీపావళికి వెళ్లడం వెనుక ఒక పక్కా పాన్ ఇండియా స్కెచ్ కనిపిస్తోంది. కొత్త డేట్ తో పాటు వదిలిన పోస్టర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. 'వన్ బ్యాడ్ హ్యాబిట్' అంటూ ఇచ్చిన క్యాప్షన్, కూల్ గా క్యాప్ పెట్టుకున్న ప్రభాస్ స్టైలిష్ లుక్ సినిమాపై ఉన్న మోస్ట్ అవేటెడ్ బజ్ ను అమాంతం పెంచేశాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ఫెస్టివల్ సీజన్ అయితేనే ఆ రేంజ్ ఓపెనింగ్స్ కు కరెక్ట్ గా సింక్ అవుతుందని మేకర్స్ ఈ పాజిటివ్ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

షూటింగ్ పరంగా చూసుకుంటే స్పిరిట్ టీమ్ చాలా పక్కా ప్లానింగ్ తోనే ఉంది. జూలైలోనే 40 శాతం షూటింగ్ పూర్తయిందని, ఆగస్టులో మరో నలభై రోజుల షెడ్యూల్ జరిగిందని వంగా చెప్పారు. వర్క్ స్పీడ్ గానే జరుగుతున్నా, ఇంత భారీ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రమోషన్ల కోసం ప్రత్యేకంగా సమయం కావాలి. అందుకే ఆ అదనపు సమయం తీసుకుని బెస్ట్ క్వాలిటీతో రావాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మార్చి 5 డేట్ ను స్కిప్ చేయడానికి టీ సిరీస్ ప్లానింగ్ కూడా ఒక రీజన్. అదే తేదీకి వాళ్ల సొంత సినిమా 'ఖోస్లా కా ఘోస్లా 2' కూడా ఉండటంతో.. ఒకే సంస్థ నుంచి రెండు విడుదలలు ఎందుకని స్పిరిట్ కు మరింత మంచి ఫెస్టివల్ స్లాట్ ను కేటాయించారు. ఈ నిర్ణయంతో బాక్సాఫీస్ దగ్గర సోలోగా వసూళ్ల సునామీ సృష్టించడానికి ఈ సినిమాకు ఫుల్ రన్ వే దొరికినట్లు అయింది.

ముఖ్యంగా దీపావళి సెలవులు హిందీ మార్కెట్ కు అతిపెద్ద అడ్వాంటేజ్. నార్త్ లో బాక్సాఫీస్ కు అసలైన పండగ అదే. 'యానిమల్' సెన్సేషన్ తర్వాత వంగా డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో, దానికి ప్రభాస్ ఇమేజ్ తోడైతే దీపావళికి అక్కడ స్క్రీన్లు దద్దరిల్లడం ఖాయం. హిందీ మార్కెట్ లో రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడానికి ఈ డేట్ ఒక బూస్ట్ లాంటిది.

మొదటి నుంచీ భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ లో తృప్తి దిమ్రి, వివేక్ ఒబెరాయ్ లాంటి సాలిడ్ క్యాస్టింగ్ ఉంది. రిలీజ్ కు అదనంగా దొరికిన ఈ టైమ్ ను టీమ్ మరింత పర్ఫెక్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి వాడుకోవడం గ్యారెంటీ. ప్రభాస్ ను థియేటర్లలో చూడటానికి ఫ్యాన్స్ కు కాస్త వెయిటింగ్ తప్పకపోయినా.. దీపావళికి వంగా ఇవ్వబోయే ట్రీట్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ తెస్తుందనడంలో డౌట్ లేదు.

Tags:    

Similar News